Begin typing your search above and press return to search.
పోలవరం ప్రాజెక్టులో మరో ముందడుగు.. ప్రస్తుతం పరిస్థితేంటి? ఎదురయ్యే సమస్యలేంటి?
By: Tupaki Desk | 23 Dec 2022 4:31 PM GMTదశాబ్దాల పోరాటానికి పోలవరం ఒక నిదర్శనం. ఎన్నో అవాంతరాలు ఆటంకాలను ఎదిరించి 75 శాతానికి పైగా ప్రాజెక్టు ఒక రూపును సంతరించుకుంది. రాజకీయ ఒత్తిడులు, సమస్యల సుడిగుండాల నుంచి అవతరిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ అందనంత అభివృద్ధికి చేరుతుందనడంలో సందేహం లేదు. తాజాగా 5,036 కోట్లకు ప్రతిపాదనలు పంపగా రెండ్రోజుల్లో వీటికి కేంద్ర మంత్రి షెకావత్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరో వైపు కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేసుకుని ప్రాజెక్టు రూపకల్పనలో ఒకడుగు ముందుకు వేసింది.. ఇవన్నీ ప్రాజెక్టు పూర్తవుతున్నాయనడానికి శుభసూచికమే అని చెప్పవచ్చు..
-ఎన్నో అడ్డంకులు...
ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ పోలవరం ప్రాజెక్టు తన రూపాన్ని సంతరించుకుంటోంది. ఏపీకి వరమైన పోలవరం ఎప్పుడు పూర్తవుతుందా అంటూ కొందరు రాజకీయ నాయకులతో పాటు రైతులు ఎంతో ఆసక్తి, ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో రాజకీయ ఒత్తిడులను ఎదుర్కొంటూ ఏపీలో గద్దెనెక్కిన ఏ ప్రభుత్వమైనా రాజకీయాలకు అడ్డాగా పోలవరం ప్రాజెక్టును వాడుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలోచనకు పునాది పడి కొన్ని దశాబ్దాలు గడిచినా ఇప్పటి వరకు పూర్తి కాకపోవడానికి రాజకీయ కారణాలే కారణమంటూ ప్రతి ఒక్కరూ వేలెత్తిచూపుతూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారాల్లో ఇదిగో పూర్తి చేస్తాం అదుగో పూర్తి చేస్తామంటూ బీరాలు పలికే నాయకులు అధికారం చేపట్టగానే తాము పెట్టిన గడువును గట్టెక్కిస్తుంటారు..
-పోలవరానికి పునాది ఇక్కడి నుంచే...
1941లో ఎల్.వెంకటకృష్ణ అయ్యర్ అనే నీటిపారుదల ఇంజనీర్ పోలవరం సమీపంలోని గోదావరిపై ఓ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు చేసినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఆ ప్రయత్నాలే ఇప్పటి పోలవరం నిర్మాణానికి పునాదులని చెప్పవచ్చు.. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 75 శాతానికి పైగా ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఎలాగైనా పూర్తి చేయించాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలె భారీగా నిధుల విడుదలకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.
-నిధుల విడుదలకు ప్రతిపాదనలు...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం నిధులు విడుదల చేయాలని కేంద్ర జల శక్తి శాఖకు సీడబ్ల్యూసీ , పీపీఏ సిఫారస్సు చేసింది. 5,036 కోట్ల రూపాయలను విడుదల చేయాలంటూ ఈ సిఫారస్సుల్లో ఉంది. పునరావాసం, భూ సేకరణ, రీయంబర్స్ మెంట్ కోసం 1,948.95 కోట్లను, ప్రాజెక్టు పనులకు 2,242.25 కోట్లను, ముందస్తు పనుల నిమిత్తం 1,115.12 కోట్లను ఇవ్వాలని సూచించింది. వీటికి జల శక్తి సంఘం ఆమోదం తెలిపి ఇవే ప్రతిపాదనలను కేంద్ర మంత్రి షెకావత్ కు పంపింది. అయితే వీటికి ఆయన ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే వీటికి రెండ్రోజుల్లో ఆయన ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
-ముందుకు మరో అడుగు...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన భాగమైన దిగువ కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. కాఫర్ డ్యామ్ పటిష్టంగా ఉండాలంటే.. దానికి ఆనుకుని డయాఫ్రం వాల్ ఉండాలని నిర్ధారించడంతో కాంట్రాక్టు సంస్థ ఈ పనులు చేపట్టింది. సుమారు 160 మీటర్లను 58 భాగాలుగా విభజించి డయాఫ్రమ్ వాల్ నిర్మించినట్టు అధికారులు వెల్లడించారు.
-ప్రయోజనం..
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించిన విషయం తెలిసిందే.. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే విశాఖలోని ఎన్నో ఫ్యాక్టరీలకు నీటి అవసరాలు తీరతాయి. తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పనిలేదు. కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత లేనప్పుడు ఈ నీటిని తరలించి సద్వినియోగం చేసుకోవాడానికి పోలవరం కల్పతరువులా ఉంటుంది.
-ఇవే ప్రధాన సమస్యలు...
పోలవరం ప్రాజెక్టు కారణంగా వందలాది గ్రామాలు నీటమునగడంతో పాటు ఎంతో ప్రముఖమైన భద్రాచలం తన స్వభావాన్ని కోల్పోవాల్సి రాక తప్పదు.. ఆంధ్రప్రదేశ్‌లో 276 గ్రామాలు, ఛత్తీస్ ఘఢ్‌లో 4, ఒడిశాలో 8 గ్రామాలు ముంపునకు గురవుతాయి. అలాగే 3,427.52 ఎకరాల అటవీ భూమి తన ఉనికిని కోల్పోనుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలో వచ్చిన సమయంలో తెలంగాణలో ముంపునకు గురవుతున్న మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా కేంద్రాన్ని ఒప్పించారు. ప్రాజెక్టు పూర్తయితే అవేమీ ఇక కనిపించవు.. భద్రాచలం రెవిన్యూ డివిజన్‌లోని కూనవరం, వర రామచంద్రాపురం, చింతూరు, భద్రాచలం మండలాలు.. పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లో వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు మండలాలు నామరూపాలు లేకుండా పోతాయి. వీరిని తమ గ్రామాల నుంచి పునరావాస గ్రామాలకు తరలించడానికి అధికారులకు కత్తిమీద సాములా మారింది. అది నిరంతర ప్రక్రియ అన్నట్టు ముంపు ప్రాంతాల వారిని పునరావాస ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.అయితే కొంత మంది తమకు అన్యాయం జరిగిందంటూ మొండికేసేవారు ఇప్పటికీ ఆయా గ్రామాల్లోనే నివాసం ఉంటున్నారు. ఇదంతా ఎప్పుడు ఒక కొలిక్కి వచ్చిద్దో మనం వేచి చూడటం తప్ప చేసేదేమీ లేదు..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.