Begin typing your search above and press return to search.
గణేశ్‌పై నయీంకు అంత భక్తి ఉందా?
By: Tupaki Desk | 26 Aug 2016 5:56 AM GMTగ్యాంగ్‌స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత రోజురోజుకూ అతని గురించి నిర్ఘాంత పరిచే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి అనేక వెరైటీ సంగతుల్లో ఇది కూడా ఒకటి. అడ్డగోలుగా దందాలు చేస్తూ జనం నుంచి డబ్బు దోచుకునే నయీం ముఠాకు గణేశ్ భక్తి దండిగానే ఉన్నట్లుంది. వినాయక చవితి సందర్భంగా తాము ఏర్పాటుచేసిన గణేశ్ విగ్రహానికి మంచి ప్రచారం లభించడానికే లక్షల రూపాయల్లో మీడియా విలేకర్లకు లంచాలు ఇచ్చారంటేనే.... వారు ఎంత గ్రాండ్‌గా చవితి ఉత్సవాలు చేశారో అర్థమవుతుంది. నయీం ముఠాలో ఈ గణేశ్ భక్తి కోణం కూడా ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది.
ఙంతకూ ఈ వివరం బయటకు రావడం కూడా చాలా తమాషాగా జరిగింది. నయీంతో సంబంధం ఉన్న అందరి గురించి ఆరాలు తీస్తున్న సిట్, పోలీసులు ఆ క్రమంలో ఓ టీవీ న్యూస్ ఛానెల్ సీఈవో హరిప్రసాద్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన నయీంతో కలిసి పలు సెటిల్మెంట్లు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయన చాలా విషయాల్లో నయీంకు అండదండలు అందించేవాడిలాగా వ్యవహారం కనిపిస్తోంది.
గత ఏడాది గణేశ్ చతుర్థి సందర్భంగా.. ప్రకాశం బజార్‌లో నయీం ముఠా విగ్రహం ఏర్పాటుచేశారుట. ఆ విగ్రహం గురించి అన్ని టీవీ ఛానళ్లలో మంచి ప్రచారం వచ్చే బాధ్యతను ఈ చానెల్ సీఈవోనే భుజాన వేసుకున్నాడు. 80 మంది విలేకర్లు, కెమెరామెన్‌లకు 80 వేల డబ్బు, టైటాన్ వాచీలు నయీం తరఫున ఇప్పించాడుట. అంటే దాదాపు రెండులక్షల రూపాయల లంచాలు ఇప్పించారన్నమాట. నయీంలో గణేశ్ ఉత్సవాల కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయగల భక్తికోణం కూడా ఉన్నదా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.