Begin typing your search above and press return to search.
తాలిబన్ల మరో రూల్..అమ్మాయిలకు శాపం, మళ్లీ ఆ రోజులే
By: Tupaki Desk | 31 Aug 2021 11:30 AM GMTఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం మొదలైన తర్వాత, ఆఫ్ఘానిస్తాన్ అక్కడ రూల్స్ ను ఒక్కొక్కటిగా మారుస్తున్నారు. తాము మారిపోయామని.. గతంలో మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తామని ఫస్ట్ చెప్పుకొచ్చిన తాలిబన్లు, ఆచరణలో మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహిళల విద్యాబోధన విషయంలో తాలిబన్లు తీసుకున్న తాజాగా నిర్ణయం. అమ్మాయిలు, యువతుల పాలిట శాపంగా మారే అవకాశం ఉందని అక్కడి విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతవారమే ఆఫ్ఘనిస్తాన్ లో కో-ఎడ్యుకేషన్ విధానాన్ని నిషేధించారు తాలబిన్లు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోవడం ఇకపై కుదరదని స్పష్టం చేశారు. తాజాగా అమ్మాయిలు చదువుకోవడానికి ఇబ్బందిగా మారే మరో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు తాలిబన్లు. ఆడపిల్లలకు చదువు చెప్పడానికి పురుషులను అనుమతించరు. దేశంలో అన్ని విద్యా కార్యకలాపాలు షరియా చట్టం ప్రకారం జరుగుతాయని తేల్చిచెప్పారు. అయితే ఈ నిర్ణయం కారణంగా బాలికలను ఉన్నత విద్య నుండి దూరం చేస్తుంది అక్కడి విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం అమ్మాయిలకు విద్యాబోధన అందించే స్థాయిలో మహిళా ఉపాధ్యాయులు లేరు. వీరి కొరత ఇప్పటికిప్పుడు తీరే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇది అమ్మాయిలు, యువతులకు విద్యావకాశాలను దూరం చేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళల పట్ల ఎలాంటి వివక్ష ఉండదని కొద్దిరోజుల క్రితం ప్రకటించిన తాలిబన్లు, ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాలిబన్ల గురించి పుస్తకాల్లో మాత్రమే చదివిన తరం, ఇప్పుడు వారితో కలిసి జీవించాల్సి వస్తోందని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఏం జరుగుతుందని అంతా ఊహించారో.. దాదాపుగా అదే జరుగుతోంది. కొద్దిరోజులుగా కాబూల్‌లో బాంబు దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో వందమందికి పైగా చనిపోయారు. వారిలో ఆఫ్ఘన్ పౌరులతో పాటు అమెరికా సైనికులు కూడా ఉన్నారు. కాబూల్ విమానాశ్రయం సమీపంలోనే ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి దాడులు జరుగుతాయని అమెరికా హెచ్చరిస్తున్నా ప్రజలు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ఆ హెచ్చరికలు పట్టించుకోకపోవడం గమనార్హం.