Begin typing your search above and press return to search.

ఉత్త‌రాఖండ్‌లో మ‌రో భీభ‌త్సం.. ఈసారి ఉత్పాతం ఇది!

By:  Tupaki Desk   |   4 Oct 2022 10:42 AM GMT
ఉత్త‌రాఖండ్‌లో మ‌రో భీభ‌త్సం.. ఈసారి ఉత్పాతం ఇది!
X
ఉత్తరాఖండ్‌లో మ‌రో భీభ‌త్సం చోటు చేసుకుంది. గ‌తంలో వ‌ర‌ద‌లు, ఇటీవ‌ల భారీ వ‌ర్షాలు, కొండ చ‌రియ‌లు విరిగిప‌డి వంద‌ల మంది మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. మంచుతో కూడిన కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో దాదాపు 28 మంది ప‌ర్వతారోహ‌కులు మృతి చెందార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే రంగంలోకి దిగిన జాతీయ విప‌త్తు స్పంద‌న ద‌ళం (ఎన్‌డీఆర్ఎఫ్‌), రాష్ట్ర విపత్తు స్పంద‌న ద‌ళం (ఎస్‌డీఆర్ఎఫ్‌) స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టాయి. హెలికాప్ట‌ర్ల‌లో ఘ‌టనా స్థ‌లికి చేరుకున్న విప‌త్తు ద‌ళాలు స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించాయి.

అస‌లు ఏం జ‌రిగిందంటే నెహ్రూ ప‌ర్వతారోహ‌ణ సంస్థ‌కు చెందిన ట్రైనీలు దాదాపు 28 మంది ఉత్త‌రాఖండ్‌లోని ఉత్త‌ర కాశీ జిల్లాలో ఉన్న ద్రౌప‌ది దండ‌-2 ప‌ర్వ‌త శిఖ‌రానికి వెళ్ల‌డానికి బ‌య‌లుదేరారు.

అయితే మంచు కొండ చరియ‌లు విరిగిప‌డ‌టంతో వీరిలో 28 మంది మృతి చెందార‌ని తొలుత వార్త‌లు వ‌చ్చాయి. అయితే అధికారికంగా న‌లుగురు మృతి చెందార‌ని ప్ర‌క‌టించారు. మ‌రో 9 మందిని ఎన్‌డీఆర్ఎఫ్‌, ఎస్‌డీఆర్ఎఫ్ ద‌ళాలు ర‌క్షించాయ‌ని చెబుతున్నారు. మిగిలిన‌వారి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి స్పందించారు. ద్రౌపది దండ-2 పర్వతంలో హిమపాతం కారణంగా నెహ్రూ పర్వతారోహణ సంస్థకు చెందిన 28 మంది ట్రైనీలు మంచులో చిక్కుకుని మృతిచెందినట్టు సమాచారం అందింద‌న్నారు. జిల్లా యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించారు అని వెల్ల‌డించారు.

ఈ ఘ‌ట‌న‌పై ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప‌ర్వ‌తారోహ‌ణ‌కు వెళ్లిన వారు మ‌ర‌ణించ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. వారి కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. అక్క‌డ చిక్కుకుపోయిన‌వారిని ర‌క్షించ‌డానికి సహాయ చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌న్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.