Begin typing your search above and press return to search.

ఇంకా ఎంత మంది ఉన్నారయ్యా..మరో 30 మంది తబ్లిగీ జమాతీల అరెస్ట్!

By:  Tupaki Desk   |   21 April 2020 12:10 PM GMT
ఇంకా ఎంత మంది ఉన్నారయ్యా..మరో 30 మంది తబ్లిగీ జమాతీల అరెస్ట్!
X
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భారీగా పెరిగిపోవడానికి కారణమైనట్టు అనుమానిస్తోన్న ఢిల్లీ సామూహిక మత ప్రార్థనలు మరోసారి అలజడి పుట్టించాయి. ఓ మసీదులో నక్కిన పలువురు తబ్లిగి జమాతీలను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అలహాబాద్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సహా 30 మంది ఉన్నారు. వారంతా ఓ మసీదులో తలదాచుకున్నట్టు గుర్తించారు. ఈ 30 మందిలో 16 మంది విదేశీయులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

ఢిల్లీ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత కూడా వారి అలజడి ఇంకా పలు రాష్ట్రాల్లో కనిపిస్తూనే ఉంటోంది. ఉత్తర ప్రదేశ్‌ ప్రయాగ్‌ రాజ్‌ లోని ఓ మసీదులో తలదాచుకుంటున్న 30 మంది జమాతీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. 16 మంది థాయ్‌ లాండ్ - ఇండోనేషియాలకు చెందిన వారు టూరిస్టు విసాల కింద భారత్‌‌ కు వచ్చారని - అనంతరం తబ్లిగి జమాత్ సామూహిక సమావేశాలకు హాజరయ్యారు. అదే సమయంలో- కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి లాక్‌ డౌన్‌ ను విధించారు.

దీనితో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీనితో విదేశాల నుంచి వచ్చిన జమాతీలు స్వదేశానికి వెళ్లలేకపోయారు. అలాంటి వారిని మనదేశానికి చెందిన జమాతీలు ఆశ్రయం కల్పించారని - స్థానిక మసీదుల్లో వారిని దాచి ఉంచారంటూ వార్తలు వెలువడ్డాయి.

దీనికి సంబంధించిన పక్కా సమాచారం అందడంతో ప్రయాగ్‌ రాజ్ పోలీసులు మెరుపుదాడి చేశారు. మసీదులో విదేశీ జమాతీలను ఆశ్రయం కల్పించిన వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ప్రఖ్యాత అలహాబాద్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అని తేలడం తో ఆయనను కూడా అరెస్టు చేశారు.