Begin typing your search above and press return to search.

అలర్ట్: సెకండ్ వేవ్ లో ఫంగస్.. థర్డ్ వేవ్ లో మరో ముప్పు..!

By:  Tupaki Desk   |   22 Jan 2022 3:42 AM GMT
అలర్ట్: సెకండ్ వేవ్ లో ఫంగస్.. థర్డ్ వేవ్ లో మరో ముప్పు..!
X
గత రెండున్నరేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తోంది. తగ్గినట్టే తగ్గి కొత్త వేరియంట్లలో రూపంలో విరుచుకుపడుతోంది. ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్ లతో మానవజాతి పై పగబట్టినట్లుగా తన ప్రతాపం చూపుతోంది. ఏడాదికోసారి కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయిలో పెంచి ప్రజల మనసుల్లో గుబులు రేపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైరస్.. ఇటు ప్రజలను కూడా ఏ మాత్రం వదలడం లేదు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ మానవ శరీరం లోకి ప్రవేశించిన నాటి నుంచి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా వైరస్ నుంచి కోలుకున్న వారిలో కూడా కరోనా తాలూకూ ఆనవాళ్లు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే వీటిని వైరస్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ అని నిపుణులు చెబుతున్నారు. ఇవి కూడా మనిషిని కొంతకాలంపాటు ఇబ్బంది పెడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయని ఓ సంస్థ అధ్యయనం చేపట్టింది ఇందులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

కరోనా వైరస్ రెండవ వేవ్ సమయంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే వైరస్ నుంచి కోలుకున్న వారు కొంతకాలం పాటు దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా కరోనా చికిత్సకు సంబంధించి స్టెరాయిడ్ లను ఉపయోగించిన కారణంగా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడ్డారు. సుమారు 2 నుంచి 3 నెలల పాటు ఈ ఫంగస్ లకు సంబంధించిన కేసులు దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. అయితే వైరస్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ మూడో వేవ్ లో కరోనా కొత్త రూపంతో వచ్చినట్టుగా తెలుస్తోంది.

మూడో వేవ్ లో వైరస్ బారిన పడి కోలుకున్న వారు ఎక్కువ మంది మానసికంగా వెనుకబడినట్లు తెలుస్తోంది. వైరస్ నుంచి బయటపడిన వారు ఎక్కువ మంది తాము జీవితంలో ఏదో కోల్పోయినట్లు భావిస్తున్నారని ఒక సర్వే తెలిపింది. అంతేకాకుండా చాలామంది తమ జీవితంలో నిరాశా నిస్పృహలు ఎక్కువైనట్లు పేర్కొన్నారు. గతంలో ఎంతో హుషారుగా ఉన్న వారు కూడా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మానసికంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సర్వే స్పష్టం చేసింది. వీరిలో చాలామంది మిగతా వారితో పోల్చుకుంటున్నట్లు సర్వేలో తేలింది. అంతేకాకుండా ఇతరులతో పోల్చుకుంటే సమయంలో తాము ఎంతో వెనుకబడి పోయినట్లు భావిస్తున్నారని పేర్కొంది. ఇలా వెనకబడి పోయినట్లు ఆలోచించే విధానాన్నే లాంగ్విషింగ్ అని పిలుస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్ బారిన పడక ముందు ఒక లక్ష్యం దిశగా అడుగులు వేసే వ్యక్తులు వైరస్ సోకిన తర్వాత వెనకబడి పోతున్నారని సర్వే నిర్వాహకులు తెలిపారు. బంధుమిత్రులతో కలిసే దానికి మీరు ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు గుర్తించారు. వీరు ఎక్కువ సమయం మూడ్ ఆఫ్ లో కనిపిస్తున్నట్లు చెప్తున్నారు.

ఈ సర్వేను 2020 నుంచి వివిధ దేశాలకు చెందిన వ్యక్తులపై నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో సుమారు పది శాతం మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. దాదాపు 78 దేశాలకు చెందిన వారిలో 10 శాతానికి పైగా మంది తీవ్రమైన మానసిక అనారోగ్యానికి గురవుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది. అయితే ఈ మానసిక ఆందోళన అనేది ఎక్కువ రోజుల పాటు రోగి నీ అంటిపెట్టుకుని ఉండదని వైద్య అధికారులు తెలిపారు.

ప్రజలు మహమ్మారి సమయంలో తీవ్రమైన మానసిక స్థితిని అనుభవించినట్లు గుర్తించారు మానసికంగా ఒత్తిడికి మనస్సుకు గాయం అవుతోందని, రొటీన్‌గా జరిగే పనుల్లో మార్పు వల్ల అనేక పనుల్లో బద్ధకం ఏర్పడుతోందని... అయితే, బద్ధకం శాశ్వతంగా ఉండదని, మానసిక స్థితిని మెరుగుపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.