Begin typing your search above and press return to search.

అంబానీ కేసులో మరో ట్విస్ట్ ... సంచలన నిర్ణయం తీసుకున్న మహా సర్కార్ !

By:  Tupaki Desk   |   11 March 2021 12:30 PM GMT
అంబానీ కేసులో మరో ట్విస్ట్ ... సంచలన నిర్ణయం తీసుకున్న మహా సర్కార్ !
X
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌అంబానీ నివాసం ఆంటిలియా దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ ముంబైలోని ముఖేష్‌ నివాసం యాంటీలియా సమీపంలోనే స్కార్పియో వాహనం అనుమానస్పదంగా కనిపించింది. ఆ వాహనంలో జిలెటిక్స్‌, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత కారులో పేలుడు పదార్ధాలు పెట్టింది తామేనంటూ ఓ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అయితే, పేలుడు పదార్ధాలతో దొరికిన కారు ఓనర్‌‌ ను మన్ ‌సుఖ్ హిరేన్ ‌గా పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే, ఆ కారు యజమాని మన్‌సుఖ్ హిరేన్ ఇవాళ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే, మన్‌ సుఖ్ హిరేన్ వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఈ కేసు లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహన యజమాని మన్‌ సుఖ్‌ హిరేన్‌ మృతిపై దర్యాప్తు జరుపుతోన్న పోలీసు అధికారి పై వేటు వేసింది. ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు క్రైం బ్రాంచ్‌ నుంచి తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం .. ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తామన్నారు. కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసు అధికారి సచిన్‌ వాజేపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. హిరేన్‌ హత్యలో సచిన్‌ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయనను వెంటనే అరెస్టు చేయాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అసెంబ్లీలో డిమాండ్‌ చేశారు. ఇక, అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు గల వాహనం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పేలుడు పదార్థాలు లభ్యమైన వాహన యజమాని అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఎన్ ‌ఐఏకి అప్పగించింది మోడీ సర్కార్‌. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్టు ఎన్ ‌ఐఏ తెలిపింది. ప్రస్తుతం ఎన్ ‌ఐఏ ఈ కేసు దర్యాప్తు లో బిజీగా ఉంది.