Begin typing your search above and press return to search.

ఎమ్మార్వో హసీనాబీ కేసు లో మరో ట్విస్ట్ .. ఇంకో వ్యక్తి తో ఆలా చేస్తూ ..?

By:  Tupaki Desk   |   14 Nov 2019 11:49 AM GMT
ఎమ్మార్వో  హసీనాబీ కేసు లో మరో ట్విస్ట్ .. ఇంకో వ్యక్తి తో ఆలా చేస్తూ  ..?
X
చట్టం ముందు ఎవరైనా తల వంచక తప్పదు ..చట్టం ఎవరికీ చుట్టం కాదు అని మనం చాలా సార్లు వైన్ ఉంటాం. అది అప్పుడప్పుడు నిజం అని అనిపిస్తుంది. అన్ని విషయాల లో కాక పోయిన , కొన్ని విషయాల లో మాత్రం చట్టం తన పని తాను చేసుకు పోతుంది. ఇక ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచాల కు అలవాటు పడి ..ఏసీబీ అధికారుల కి అడ్డంగా దొరికి పోయింది. ఇక అప్పటినుండి ఏసీబీ అధికారుల కి చిక్కకుండా , మరో వ్యక్తి తో కలిసి మకాం మార్చుతూ ... అధికారుల కళ్ళు కప్పి తిరుగుతుంది.

ఆ ప్రభుత్వ ఉద్యోగురాలు మరెవరో కాదు ..కర్నూల్ జిల్లా ,గూడూరు తహసీల్దార్ హసీనాబీ. ఈమె ఒక వ్యక్తి నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డబ్బు ఆమె డైరెక్ట్ గా తీసుకోక పైనా ..తన తమ్ముడి తో ఈ వ్యవహారం అంతా నడిపింది. ఈ నెల 8న సురేష్‌ అనే వ్యక్తి నుంచి రూ.4 లక్షలు తీసుకున్న మహబూబ్‌ బాషాను ఏసీబీ అరెస్టు చేసింది. అప్పుడు మహబూబ్‌ బాషా నేను ఎమ్మార్వో ఇంట్లో పనిచేసే వాడిని అంటూ ఏసీబీ అధికారుల నే బురిడీ కొట్టించాడు. కానీ , తాజాగా వారి తల్లిదండ్రుల ని తీసుకోని వచ్చి విచారణ చేయగా ..అసలు వ్యవహారం బయట పడింది. ఆమె కోసం ఏసీబీ అధికారులు విచారిస్తున్న సమయం లో మరిన్ని కొత్త విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి.

హసీనాబీ తల్లిదండ్రుల ను కలిసిన ఏసీబీ అధికారుల కు అసలు విషయం తెలిసింది. హసీనాబీ నలుగురు సోదరుల్లో మహబూబ్‌ బాషా ఒకరని ఆమె తల్లిదండ్రులు ఏసీబీ అధికారుల కు తెలిపారు. తమ తో గాని, ఇతర సోదరులతో గాని హసీనాబీ కి మాటలు, రాక పోకలు లేవని కూడా ఏసీబీ అధికారుల కు వివరించారు. మహబూబ్‌ బాషా తో మాత్రమే అప్పుడప్పుడు హసీనాబీ మాట్లాడేవారని కూడా తల్లిదండ్రులే ఏసీబీ అధికారులకు తెలిపారు. దీంతో పాటు హసీనాబీ ఎవరో ఓ వ్యక్తితో కలిసి ఉంటోందని, ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని కూడా తల్లిదండ్రులు ఏసీబీ అధికారులకు తెలిపారు. దీనితో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు చివరికి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆమె ఎక్కడ ఉన్నదో కనుగొన్నారు. అక్కడ హసీనాబీ ఓ వ్యక్తితో దిగిన ఫొటోలు వారికి లభించాయి. ఆరా తీస్తే ఆ వ్యక్తి కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్య అని తేలింది.

గిడ్డయ్య ఈ నెల 8 నుంచి పరారీలో ఉన్నట్లు తేలింది. ఈనెల 11 నుంచి నెల రోజుల పాటు ఆయన మెడికల్‌ లీవ్‌ పెట్టి వెళ్లినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ కేసులో ముద్దాయి గా ఉన్న హసీనాబీ కి ఆశ్రయం ఇచ్చినందుకు ఎంపీడీవో గిడ్డయ్యపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగ భూషణం తెలిపారు. వీరిద్దరు కలిసి పరారైనట్లు తమకు సమాచారం ఉందన్నారు. ముద్దాయికి ఆశ్రయం కల్పించినా, ఆ ముద్దాయి గురించి సమాచారం దాచిపెట్టినా నేరం గానే పరిగణిస్తామని డీఎస్పీ వెల్లడించారు. కర్నూలు బీ, సీ క్యాంపుల్లోని 7 హాస్టళ్లలో హసీనా రూములు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాదు అన్ని హాస్టళ్లకు ప్రతి నెల రూమ్ అద్దె కూడా చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే హసీనాబీ ఇన్ని హాస్టళ్ల లో రూములు ఎందుకు తీసుకున్నారు అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.