Begin typing your search above and press return to search.
దిశ నిందితుల కేసు లో మరో ట్విస్ట్?
By: Tupaki Desk | 21 Dec 2019 5:57 AM GMTదిశ నిందితుల కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఈ నలుగురి మృత దేహాలకు ఇప్పటికీ అంత్యక్రియలు జరగలేదు. సుప్రీం కోర్టు, హైకోర్టు, మానవ హక్కుల సంఘాలు విచారణ జరుపుతుండడం తో వీరి బాడీలను భద్రపరిచారు.
తాజాగా ఈ నలుగురు నిందితుల మృతదేహాల కు రీ పోస్టు మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలిసింది. శుక్రవారం దిశ నిందితులపై విచారణ జరిపిన హైకోర్టు మళ్లీ రీ పోస్టు మార్టం నిర్వహించాలని ఆదేశిస్తామని తెలిపింది. ఈ ప్రక్రియ ముగిశాకే మృతదేహాల ను కుటుంబ సభ్యుల కు అప్పగించాలని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ బెంచ్ తెలిపింది. దీని కోసం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఫోరెన్సిక్ నిఫుణులను రప్పిస్తున్నారట..
అయితే ప్రభుత్వం తరుఫున వాదించిన లాయర్ బీఎస్ ప్రసాద్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సుప్రీం మార్గదర్శకాల ప్రకారమే పోస్టుమార్టం నిర్వహించారని.. మళ్లీ రీ పోస్టు మార్గం అవసరం లేదని తెలిపారట..
దీనిపై స్పందించిన హైకోర్టు రీ పోస్టు మార్టానికి ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకమో చెప్పాలని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ సమయం కావాలని కోరడం తో ఈ రోజు కు విచారణ వాయిదా పడింది.