Begin typing your search above and press return to search.

నిర్భయ కేసు లో మరో ట్విస్ట్ ...వినయ్ శర్మకు స్లో పాయిజన్

By:  Tupaki Desk   |   25 Jan 2020 10:03 AM GMT
నిర్భయ కేసు లో మరో ట్విస్ట్ ...వినయ్ శర్మకు స్లో పాయిజన్
X
నిర్భయ కేసు దోషుల విషయంలో కొత్త ట్విస్ట్ . నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మకు స్లో పాయిజన్ ఇచ్చారని, దాంతో అతను ఆస్పత్రి పాలయ్యాడని, అతని మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వడం లేదని నిర్భయ రేప్ కేసు దోషుల తరఫున న్యాయవాది ఏపీ సింగ్ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు పిటిషన్ వేశారు. అతను జైలు ఆసుపత్రి తో పాటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ, లోక్ నాయక్ జై, ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారని, విష ప్రయోగం వల్ల అతని చేతికి పగుళ్లు ఏర్పడ్డాయని న్యాయవాది కోర్టులో వాదించారు.

వినయ్ శర్మ చికిత్స సంబంధించిన రుజువులు తిహార్ జైలులోని 2,3 గదుల్లో ఉన్నాయని, అతన్ని ప్రస్థుతం 4వ నంబరు జైలుకు మార్చారని న్యాయవాది కోర్టులో తెలిపారు. వినయ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్థుతం బాగా లేదని, అతను భోజనం చేయడం లేదని, రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థన లో ఈ విషయాలన్నీ పరిగణన లోకి తీసుకోవాలని న్యాయవాది కోరారు. శనివారం కోర్టు విచారణ సందర్భం గా ఏపీ సింగ్ ఆ విషయం చెప్పారు. దోషులు మెర్సీ పిటిషన్ పెట్టుకోవడానికి అవసరమైన పత్రాలను ఇవ్వడంలో తీహార్ జైలు అధికారులు జాప్యం చేస్తున్నారని ఆయన కోర్టు కు తెలిపారు ఈ మేరకు తన దరఖాస్తును ఈ నెల 24వ తేదీన కోర్టు కు సమర్పించారు.

అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, ముకేష్ కుమార్ సింగ్ క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేసుకోవడానికి అవసరమైన పత్రాలను జైలు అధికారులు ఇవ్వడంలేదు అని అయన ఆరోపించారు. కాగా నిర్భయ దోషులు ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారని, దోషుల న్యాయవాది కోరిన అన్ని పత్రాలను తిహార్ జైలు అధికారులు ఇప్పటికే అందించారని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. నిర్భయ కేసు దోషులను నలుగురిని ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని డెత్ వారంట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో ఆ ఉరి శిక్ష తేదీని జాప్యం చేసేందుకు దోషులు వివిధ పిటిషన్లు వేసి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.