Begin typing your search above and press return to search.

రాజ‌ధాని క‌థ‌లో మ‌రో ట్విస్టు ? అదిరింద‌య్యా జ‌గ‌న్ !

By:  Tupaki Desk   |   25 March 2022 4:32 AM GMT
రాజ‌ధాని క‌థ‌లో మ‌రో ట్విస్టు ? అదిరింద‌య్యా జ‌గ‌న్ !
X
మ‌ళ్లీ ఆట మొద‌ల‌యింది ఆట ఆగిన చోట చంద్ర‌బాబు ఉన్నారు మొద‌ల‌యిన చోట జ‌గ‌న్ ఉన్నారు పునః ప్రారంభ శ‌కంలో జ‌గ‌న్ ఏం మాట్లాడినా వాటిలో రాజ‌నీతి ఉందా లేదా అన్న‌ది ముఖ్యం రాజ‌కీయ చాణ‌క్య‌త మాత్రం పుష్క‌లంగా ఉందిఆ విధంగా ధ‌ర్మానను ఉప‌యోగించుకుని జ‌గ‌న్ నాలుగు మంచి మాట‌లు చెప్పించి, హాయిగా కోర్టులలో ఏ ఇబ్బందీ రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌డం ఇప్ప‌టి జ‌గ‌న్ అవలంబించిన ప్ర‌త్యేక సూత్రం మ‌రియు ఇదే ఆయ‌న అనుస‌రించాల‌నుకుంటున్న లాజిక‌ల్ వే కూడా ! ఇంకేం రాజ‌ధాని ఉంటుంది కానీ అది అమ‌రావ‌తి పేరిట ఉంటుందా లేదా అన్న‌ది చెప్ప‌రు కానీ టెక్నిక‌ల్ గా కేంద్రం ఇచ్చే నిధులు మాత్రం వాడుకుంటారు..

అంటే డెడ్ లైన్ కు అనుగుణంగా రాజ‌ధానిని అయితే డెవ‌ల‌ప్ చేయ‌లేం అని కోర్టుకు నిన్న‌టి స‌భ ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు..ఇదీ టీడీపీ వాద‌న మ‌రియు అంత‌ర్మ‌థ‌నం. అయితే రాజ‌ధాని రైతుకు అండ‌గా ఉంటామ‌న్న చిల‌క ప‌లుకులు కొన్ని నిన్న‌నే వినిపించాయి అని టీడీపీ అంటోంది. వాటిపై వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఇక!

నిన్న‌టి వేళ శాస‌న స‌భ‌లో మ‌రో ముఖ్య‌మ‌యిన ఘ‌ట్టం నెల‌కొంది. చాలా కాలం త‌రువాత ఒక చ‌ర్చ‌కు తావిచ్చేలా జ‌గ‌న్ తో పాటు ఇంకొంద‌రు మాట్లాడారు. అందుకు అనుగుణంగా స‌భను హాయిగా త‌మ‌కు అనుగుణంగా మ‌లుచుకుని సీనియ‌ర్ శాస‌న స‌భ్యులు ధ‌ర్మాన‌తో మాట్లాడించారు కూడా! ఆయ‌నకున్న అనుభ‌వం దృష్ట్యా చాలా విష‌యాలు వివ‌రించేందుకు ప్ర‌య‌త్నించారు.

స‌ఫ‌లీకృతం అయ్యారు. ఓ స్థాయి నుంచి మ‌రో స్థాయి వ‌ర‌కూ ఒక వ్య‌వ‌స్థ నుంచి మ‌రో వ్య‌వ‌స్థ వ‌ర‌కూ మ‌న జీవితాలు ఏ మేర‌కు మారి ఉన్నాయో క‌ళ్ల‌కు క‌ట్టిన విధంగా వివ‌రించారు. న్యాయ వ్య‌వ‌స్థ‌ల జోక్యం గురించి శాస‌న వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరు గురించి కూడా వివ‌రించి ఆక‌ట్టుకున్నారు. ఆ స్థాయిలో జ‌గ‌న్ కూడా కొన్ని విష‌యాలు చెప్పి ఉంటే బాగుండేది కానీ ఆయ‌నకు ఉన్న దృష్టి కేవ‌లం 3 రాజ‌ధానుల‌పైనే క‌నుక వాటి గురించే మరో మారు చెప్పారు.

ఎప్ప‌టిలానే అభివృద్ధి అంటే ఆత్మ‌గౌర‌వ సంబంధం అని ఓ ప్రాంతీయ ఉద్వేగాన్ని తెర‌పైకి తెచ్చారు. రాజ‌ధాని రైతుల‌కు కూడా సాయం చేస్తామ‌ని,అండ‌గా ఉంటామ‌ని ఎట్ట‌కేల‌కు ఇంకా చెప్పాలంటే తొలిసారి వారికి మ‌ద్ద‌తు ఇచ్చేలా మాట్లాడారు. ఓ విధంగా స‌మీపాన ఎన్నిక‌లు ఉండ‌డం వ‌ల్ల‌నేమో ! ఈ సారి వారిని ఉద్దేశించి మాట్లాడిన‌ప్పుడు ఎన్న‌డూ లేని జాగ్ర‌త్త‌లు వైసీపీ స‌భ్యుల‌ను లీడ్ చేసే ముఖ్య‌మంత్రిలో ఉండ‌డం బాగుంది.

అదేవిధంగా వారి ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని మాత్రం క‌చ్చితంగా చెప్ప‌లేక‌పోవ‌డం విచార‌కరం. సుదీర్ఘ కాలంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై అడుగులు వేస్తాన‌ని కూడా చెప్ప‌లేదు. కానీ ఆయ‌న కోపం కొంత న్యాయ వ్య‌వ‌స్థ పై ఉంది. ఆ కోపానికి కొన‌సాగింపు ఇవ్వ‌కుండా త‌మ‌కు న్యాయ వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం ఉంద‌ని తెలివిగా త‌న గేమ్ మ‌ళ్లీ ప్రారంభించారు. అంటే ఆగిపోయిన ఆట‌ను తిరిగి ప్రారంభించేందుకు నిన్న‌టి సెష‌న్ ను త‌న‌కు అనుగుణంగా మ‌లుచుకున్నారు.