Begin typing your search above and press return to search.

తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి..?

By:  Tupaki Desk   |   9 July 2022 2:30 PM GMT
తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి..?
X
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కొన్ని రోజుల కిందట ఇక్కడ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాల తరువాత నిర్వహించిన విజయసంకల్ప సభ సక్సెస్ కావడంతో అధిష్టానం ఫుల్ ఖుషీ అయింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో భారీ అఫర్లు ప్రకటిస్తోంది. తాజాగా తెలంగాణ నుంచి మరో ఎంపీకీ కేబినెట్లో చోటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. త్వరలో మరో ఎంపీకీ అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు గెలుపొందారు. వారిలో సింకింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత పూర్తిస్థాయిలో పర్యాటక శాఖ ను అప్పగించారు.

కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర అధ్యక్షుడి పదవిని కట్టబెట్టారు. ఆయన అధ్యక్షుడయ్యాక తెలంగాణలో పార్టీ పరిస్థితి మారిపోయింది. దీంతో ఆయనను ఆ పదవి నుంచి తప్పించే అవకాశం లేదు. కొన్ని రోజులు ఈటల పేరు అధ్యక్షుడని వినిపించింది. కానీ ఆయనకు చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించడంతో ప్రచారం ఆగిపోయింది.

ఇక మిగిలిన ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ఉన్నారు. వీరిలో ఎవరికి చోటు దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులులగా తమ పదవీకాలం పూర్తి కావడంతో ముక్తార్ అబ్బాస్ నక్వీ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి పదవికి, ఆర్పీ సింగ్ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

ఆయా పదవులను ప్రస్తుతం స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్య అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ఇందులో ఒక పోస్టును తెలంగాణకు చెందిన ఎంపీకి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణలో ముందస్తు ఊహాగానాలు జోరందుకున్నాయ. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికారంలోకి రావాలని బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అవకాశం ఉన్న ప్రతీ మార్గం నుంచి తెలంగాణకు న్యాయం చేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన అధిష్టానం మరో పోస్టు కూడా ఇవ్వడంతో ఇక్కడ బీజేపీకి మరింత బలం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చే ఎన్నికల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బీజేపీ మరింత ఫాంలోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ అనుకుంటోంది. అయితే కేబీనేట్లో చోటు దక్కించుకునే ఆ ఎంపీ ఎవరో చూద్దాం..