Begin typing your search above and press return to search.
ప్రభాస్ ను కలవనున్న మరో కేంద్రమంత్రి
By: Tupaki Desk | 14 Sep 2022 7:32 AM GMTహైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ కేంద్రమంత్రులంతా మన హీరోలను కలవడం ఆనవాయితీగా వస్తోంది. మొదట కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ను కలిశాడు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చి హీరో నితిన్ తో భేటి అయ్యారు. తాజాగా మరో కేంద్రమంత్రి రాబోతున్నారు. ఈసారి ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ను కలవనున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసేందుకు ఆయన ఇంటికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రానున్నారు.పెద్దనాన్న కృష్ణంరాజును కోల్పోయి బాధలో ఉన్న ప్రభాస్ ను ఈనెల 16వ తేదీన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 16న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన 16న నిర్వహించనున్న కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొంటారు. రాజ్ నాథ్ సింగ్ తోపాటు ఇతర నేతలు కూడా పాల్గొననున్నారు.
బీజేపీలో చేరి కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు మరణం పట్ల చింతిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ట్వీట్ చేశారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ సహా ప్రముఖ హీరోలు, దర్శక, నిర్మాతలు , రాజకీయప్రముఖులు ఇలా వరుసగా సెలబ్రెటీలంతా ప్రభాస్ ను పరామర్వించారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు.
కృష్ణంరాజు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరుఫున తొలిసారి ఎంపీగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాయి.
1998 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఉమ్మడి ఏపీలో 42 స్థానాలకు గాను బీజేపీ నాలుగు స్తానాల్లో గెలిచింది. కాకినాడ నుంచి కృష్ణంరాజు గెలిచారు. బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా కేంద్రమంత్రిగా పనిచేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.