Begin typing your search above and press return to search.
కరోనా నియంత్రణకు మరో వ్యాక్సిన్
By: Tupaki Desk | 7 Feb 2022 7:31 AM GMTకరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు తొందరలోనే మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. స్పుత్నిక్ లైట్ అనే వ్యాక్సిన్ కు వినియోగానికి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అన్ని అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ స్వయంగా ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. తాజాగా స్పుత్నిక్ లైట్ కు ఇచ్చిన అనుమతితో కరోనా వైరస్ పై పోరాడటానికి తొమ్మిది వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్పుత్నిక్-5 తరహాలోనే స్పుత్నిక్ లైట్ కూడా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. దీంతో డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ నిపుణులు స్పుత్నిక్ లైట్ వాడకంపై డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు సిఫారసు చేశారు. తొందరలోనే స్పుత్నిక్ లైట్ వినియోగానికి డ్రగ్స్ కంట్రోల్ నూరుశాతం అనుమతులు వస్తాయని అనుకుంటున్నారు. ఒకసారి నూరుశాతం అనుమతులు వచ్చేస్తే వెంటనే స్పుత్నిక్ లైట్ మార్కెట్లోకి వచ్చేస్తుంది.
ఒకవైపు కరోనా వైరస్, ఒమిక్రాన్ పేరుతో దేశంలో అల్లకల్లోలం చేసేస్తోంది. ఈ సమస్య ఇప్పుడిప్పుడే పోదని ఏదో రూపంలో సమాజాన్ని ఇబ్బంది పెడుతునే ఉంటుందని నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తునే ఉన్నారు. దానికి తగ్గట్లే ఒక వైరస్ తగ్గిందని అనుకునేంతలోనే మరో వైరస్ లేదా డెవలప్ అయిన కొత్త వేరియంట్ సమాజం మీద ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ అలా వచ్చిందే. కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంత ఉధృతంగా లేకపోయినా ఒమిక్రాన్ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది.
వైరస్ లో ఏదో రూపంలో విజృంభిస్తున్నంత వేగంగా వ్యాక్సిన్లు తయారుకావు. ఈ కారణంగానే వైరస్ దెబ్బకు జనాలు బలైపోతున్నారు. పైగా మనదేశంలో భౌతిక దూరం సాధ్యం కాదు. అందులోను మాస్కులు వేసుకునే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోతోంది. ఒకపుడు కరోనా అంటే ఉన్న భయం కూడా చాలామందిలో ఇఫుడు పోయింది.
అందుకనే యధేచ్చగా అవసరం ఉన్నా లేకపోయినా బయట తిరిగేస్తున్నారు. ఈ కారణంగానే వైరస్ లు మళ్ళీ పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎన్ని వ్యాక్సిన్లు వస్తే జనాలకు అంతమంచిది. ఇందులో భాగంగానే స్పుత్నిక్ లైట్ కు అనుమతులు మంజూరయ్యాయి.