Begin typing your search above and press return to search.

బయోఫోర్ నుంచి కరోనాకు మరో వ్యాక్సిన్ .. డీజీసీఐకి దరఖాస్తు !

By:  Tupaki Desk   |   12 Jun 2021 3:30 PM GMT
బయోఫోర్ నుంచి కరోనాకు మరో వ్యాక్సిన్ .. డీజీసీఐకి దరఖాస్తు !
X
మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఇప్పటికే పలు కంపెనీలు ఔషధాలను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో మరో హైదరాబాద్ కంపెనీ బయోఫోర్ మరో ముందడుగు వేసింది. తాము తయారుచేసిన అవిస్టాడిల్‌ మందుకి అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) కి దరఖాస్తు చేసుకున్నట్లు బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ శుక్రవారం వెల్లడించింది. డీజీసీఐ నుంచి అనుమతి లభించిన వెంటనే వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు బయోఫోర్ ప్రతినిధులు పేర్కొన్నారు.

తమ ఔషధ వినియోగంతో కరోనా సీరియస్‌ కేసుల్లో రోగులు వేగంగా కోలుకుంటున్నట్లు రుజువైనట్లు తెలిపారు. వాసోయాక్టివ్ ఇంటెస్టినల్ అవిస్టాడిల్ ఆసుపత్రుల్లో సీరియస్ కండిషన్‌ లో చికిత్స పొందుతున్న రోగులు కోలుకోవడానికి ఉపయోగపడుతుందని క్లినికల్ టెస్టుల్లో నిరూపితం అయిందని కంపెనీ సీఈవో డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. కోవిడ్‌ మొదటి వేవ్‌ సమయంలో యాంటీ వైరల్‌ ఔషధం ఫావిఫిరవిర్‌ ఉత్పత్తికి అనుమతి పొందిన అతికొద్ది కంపెనీల్లో హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్‌ ఒకటిగా నిలిచింది. దీని తర్వాత ఇప్పుడు అవిప్టాడిల్ ను రూపొందించి అనుమతి కోసం ఎదురుచూస్తోంది. అయితే దీనికి డీసీజీఐ నుంచి అనుమతులు రాగానే ఉత్పత్తిని ప్రారంభిస్తామని బయోఫోర్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధానికి నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని సంస్థ సీఈవో డాక్టర్ జగదీశ్ బాబు తెలిపారు.