Begin typing your search above and press return to search.
తొందరలోనే మరో టీకా వచ్చేస్తోంది
By: Tupaki Desk | 7 May 2021 10:04 AM ISTకరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో తొందరలోనే మరో టీకా జనాలకు అందుబాటులోకి వచ్చేస్తోంది. రష్యా తయారీ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ, స్పుత్నిక్ లైట్ అనే రెండు రకాల టీకాలను రష్యాన్ ఫార్మాకంపెనీ తయారుచేసింది. ఆ దేశంలో అన్నీరకాల క్లినికల్ ట్రయల్స్ ను పూర్తిచేసింది. స్పుత్నిక్ వి టీకా కన్నా మరింతగా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ టీకా మరింత ప్రభావశీలంగా పనిచేస్తోందని పరీక్షల్లో తేలింది.
ప్రస్తుతం మనదేశంలో కరోనా వైరస్ కు టీకాలంటే రెండు కంపెనీలు అందిస్తున్న కోవీషీల్డ్, కోవ్యాగ్సిన్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రెండు ఫార్మాకంపెనీలు కూడా దేశం అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి. దీని ఫలితంగా వ్యాక్సినేషన్ కోసం కోట్లాదిమంది జనాలు వారాల తరబడి ఎదురుచూడక తప్పటంలేదు. దేశావసరాలకు తగ్గట్లుగా టీకాలను ఉత్పత్తి చేయలేక ఇప్పటికే రెండు ఫార్మాకంపెనీలు చేతులెత్తేసిన విషయం అందరు చూస్తున్నదే.
ఈ నేపధ్యంలోన రష్యా ఫార్మాకంపెనీ స్పుత్నిక్ వీ టీకా మూడోదశ క్లినికల్ ట్రయల్స్ రష్యాతో పాటు ఘనా, యూఏఈతో పాటు మరికొన్ని దేశాల్లో చివరిదశకు చేరుకుంది. అందుకనే మనదేశంలో కూడా మూడోదశ క్లినికల్ ట్రయల్స్ కు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతిచ్చింది. రష్యా ఫార్మాకంపెనీతో కలిసి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రెడ్డీ ల్యాబరేటరీ అవసరమైన మూడోదశ క్లినికల్ టెస్టులకు రెడీ అవుతోంది.
రెడ్డీ ల్యాబ్ తో పాటు హెటిరో బయోఫార్మా తో పాటు స్పుత్నిక్ వీ టీకా ఉత్పత్తికి గ్లాండ్ ఫార్మా, విర్కో బయోటెక్, స్టెలిస్ బయో, పానేషియా బయోటెక్స్, శిల్పా మెడికేర్ ఫార్మా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయ. ఈ క్లినికల్ ట్రయల్స్ గనుక సక్సెస్ అయిపోతే స్పుత్నిక్ లైట్ టీకా కూడా తయారు చేయవచ్చు. అప్పుడు టీకాల కొరత కొంతైనా తగ్గుతుంది.