Begin typing your search above and press return to search.
ప్రపంచంపైకి మరో వైరస్.. సోకితే 8 రోజుల్లో మరణం: WHO
By: Tupaki Desk | 22 July 2022 12:48 AM GMT21వ శతాబ్ధంలో మనిషిపై వైరస్ ల దాడి ఎక్కువైంది. కరోనాతో మొదలైన దాడులు కొత్తకొత్తగా రూపాంతరం చెందుతూ విరుచుకుపడుతూనే ఉన్నాయి. కరోనా తగ్గి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచాన్ని మరో వైరస్ భయపెడుతోంది.
ఇటీవల ప్రపంచ దేశాలను ‘మంకీపాక్స్’ వైరస్ కలవరపెడుతోంది. బ్రిటన్ లో వెలుగుచూసిన ఈ వైరస్ నెమ్మదిగా ఇతరదేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే 120కి పైగా కేసులు నమోదయ్యాయి. మరిన్ని కేసులు పరిశీలనలో ఉన్నాయి.
దాంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.మే 7న బ్రిటన్ లో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ ను కనుగొన్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన వ్యక్తిలో వైరస్ బయటపడింది. అప్పటి నుంచి బ్రిటన్ లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 20కి ఆ సంఖ్య చేరుకుంది. స్పెయిన్ లోనూ ఇప్పటివరకూ 23 కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఈ కేసుల జాబితాలో చేరిపోయాయి.
యూకే, అమెరికా, కెనడా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో పదుల సంఖ్యలో మంకీ పాక్స్ వైరస్ కేసులు నమోదయ్యాయి. కోతులు, ఎలుకలు, ఉడుతల ద్వారా వ్యాపించే ఈ వైరస్.. యూకేలో శృంగారం ద్వారా కూడా సోకుతుందని.. ముఖ్యంగా గే లేదా బైసెక్సువల్ మెన్ ల ద్వారా ఇది వ్యాపించడం ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ వైరస్ సోకితే తలనొప్పి, చలి, కండరాల నొప్పి లాంటి లక్షణాలుంటాయి. మంకీపాక్స్ పలు దేశాల్లో వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. కెనడాలో డజనుకు పైగా మంకీపాక్స్ అనుమానిత కేసులు బయటపడ్డాయి. అమెరికాలోనూ మంకీ పాక్స్ తొలి కేసు నమోదైంది. ఇటీవల కెనడా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ నిర్ధారణ అయినట్లు అమెరికా బుధవారం ప్రకటించింది.
కరోనా, మంకీపాక్స్ తర్వాత ఇప్పుడు మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇది సోకిన 8 రోజుల్లోనే మరణం సంభవిస్తుండడం కలకలం రేపుతోంది. ఘనాలో బయటపడ్డ ‘మార్ బర్గ్’ వైరస్ ను నిర్లక్ష్యం చేస్తే మరణం తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) హెచ్చరించింది.
ఘనాలో మార్ బర్గ్ వైరస్ సోకి ఇద్దరు మరణించగా.. వారితో కాంటాక్ల్ అయిన 98మంది ఐసోలేషన్ లో ఉన్నారు. అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, తిమ్మిర్లు, వాంతులు, విరోచనాలు, మార్ బర్గ్ లక్షణాలు. వైరస్ సోకిన 5-7 రోజుల మధ్య ముక్కు, చిగుళ్లు, మలం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి 8-9 రోజుల్లోనే మరణం సంభవిస్తుందని డబ్ల్యూహెచ్.వో తెలిపింది.