Begin typing your search above and press return to search.

చైనాలో మరో వైరస్ కలకలం.. కరోనా కంటే డేంజర్ , తోలి మరణం నమోదు !

By:  Tupaki Desk   |   19 July 2021 11:30 AM GMT
చైనాలో మరో వైరస్ కలకలం.. కరోనా కంటే డేంజర్ , తోలి మరణం నమోదు !
X
చైనా ... రకరకాల మహమ్మారులకి పుట్టినిల్లు. చైనా దేశంలో ప్రాణాంతక వైరస్‌ లకు పుట్టుకకు కేంద్రంగా మారినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలోని వుహాన్ పరిశోధనా ల్యాబ్ నుంచి కరోనా వైరస్ మహమ్మారులు పుట్టినట్టు ప్రపంచ దేశాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మరో కరోనా వైరస్ చైనా నుంచి పుట్టినట్టుగా భావిస్తున్నారు. ఈ వైరస్ పేరు మంకీ బి. కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన మరో కొత్త వైరస్ చైనాలో బయటపడింది. మంకీ బీ గా పిలిచే ఈ కొత్త వైరస్‌తో చైనాలో ఓ శాస్త్రవేత్త మరణించడం కలకలం రేపుతోంది. కోతులపై పరిశోధనలు చేసే పశువైద్య నిపుణులు ఒకరు మంకీ బీ బారిన పడి మరణించారు.

మంకీ బీ వైరస్ బయటపడేందుకు 1 నుంచి 3 వారాల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంకీ బీ వైరస్ సోకితే ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని గుర్తించారు. వైరస్ సోకితే 70 నుంచి 80 శాతం మంది మరణించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కోతుల నుంచి మనుషులకు సంక్రమించే 'మంకీ బి' వైరస్‌తో ఓ వ్యక్తి మరణించినట్టు చైనా తాజాగా వెల్లడించింది. ఇదే తొలి కేసు, తొలి మరణమని పేర్కొంది. అయితే, అతడితో సన్నిహితంగా ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు లేవని స్థానిక మీడియా తెలిపింది.

జంతువులపై పరిశోధనలు చేస్తున్న బీజింగ్‌ కు చెందిన ఓ పశువైద్యుడు మార్చిలో రెండు చనిపోయిన కోతుల శరీరాలను ముక్కలుగా చేసి పరీక్షించాడు. అనంతరం అతడు వాంతులు, వికారం వంటి లక్షణాలతో బాధపడ్డాడు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మే 27న సదరు వైద్యుడు మరణించినట్టు అధికారులు తెలిపారు. వైద్యుడి నమూనాలు పరిశీలించగా మంకీ బి వైరస్ కారణంగా అతడు మరణించినట్టు నిర్ధారణ అయింది. చైనాలో ఇంతకుముందు ఇలాంటి వైరస్ ఎవరిలోనూ బయటపడలేదని, ఇదే తొలి కేసు, తొలి మరణమని చైనాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఈ వైరస్‌ను తొలిసారి 1932లో మకాక్స్ అనే కోతి జాతిలో గుర్తించారు. కోతుల నుంచి నేరుగా మనుషులకు సంక్రమించే ఈ వైరస్ చాలా ప్రమాదకరమని, ఇది సోకితే మరణాల రేటు 80 శాతం వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్‌ను మంకీ 'బీవీ'గా పిలుస్తారు.