Begin typing your search above and press return to search.

రోహిత్ ముంగిట పరుగుల రికార్డు.. ఈ మ్యాచ్ లో అందుకుంటాడా?

By:  Tupaki Desk   |   24 Feb 2022 1:30 PM GMT
రోహిత్ ముంగిట పరుగుల రికార్డు.. ఈ మ్యాచ్ లో అందుకుంటాడా?
X
సరిగ్గా రెండేళ్ల క్రితం వరకు టెస్టు జట్టులో చోటు ఖాయం కాని రోహిత్ శర్మ.. ఇప్పుడు టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్. అంతేకాదు ఇప్పుడు జట్టులో టాప్ బ్యాట్స్ మన్. విరాట్ కోహ్లిని కిందకు నెట్టి అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడీ ముంబై బ్యాట్స్ మన్. అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు దక్కిన రోహిత్.. మూడు టి20 సిరీస్ లలో వరుసగా క్లీన్ స్వీప్ లతో అదరగొట్టాడు.

టి20ల్లో బాదుడుకు మారు పేరుగా నిలిచిన రోహిత్ కెప్టెన్సీ దక్కాక నిలకడగా ఆడుతూ జట్టును గెలిపిస్తున్నాడు. వన్డే సారథిగానూ తొలి అధికారిక సిరీస్ లోనే స్వీప్ కొట్టిన రోహిత్.. ఇప్పడు శ్రీలంకతో టి20 సిరీస్ కు సన్నద్శం అవుతున్నాడు. ఇందులో అతడు రికార్డు అందుకునే అవకాశం ఉంది. గురువారం లక్నో వేదికగా శ్రీలంక- భారత్‌ టి20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో మరో 36 పరుగులు చేస్తే.. అంత‌ర్జాతీయ‌ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రోహిత్‌ రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ 3,263 పరుగులతో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. 3299 ప‌రుగుల‌తో న్యూజిలాండ్ బ్యాట‌ర్ మార్టిన్ గుప్టిల్ తొలి స్ధానంలో ఉండ‌గా, 3,296 ప‌రుగుల‌తో టీమిండియా మాజీ కెప్టెన్‌ కోహ్లి రెండో స్ధానంలో ఉన్నాడు.

సూర్య కుమార్ ,హుడా లేకుండానే సిరీస్ కు టి20 సిరీస్ కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ కు విశ్రాంతినిచ్చింది. వీరిద్దరూ టెస్టు సిరీస్ కు అందుబాటులోకి వస్తారు. మార్చి 4న ఆరంభమయ్యే తొలి టెస్టు కోహ్లి కెరీర్ లో వందోది కావడం విశేషం. రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ గాయాల కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఇటీవల స్టార్ గా ఎదిగిన మిడిలార్డర్ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్, కొత్త కుర్రాడు దీపక్ హుడా లేకుండానే టీమిండియా టి20 సిరీస్ బరిలో దిగుతోంది. అయితే, గాయం నుంచి కోలుకున్న జడేజా, విశ్రాంతి అనంతరం జస్ర్పీత్ బుమ్రా జట్టులోకి వచ్చారు.

కాగా, భారత్ శ్రీలంక ఇప్పటి వరకు 21 మ్యాచుల్లో తలపడగా.. భారత్ 14, శ్రీలంక 7 విజయాలు సాధించాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అయితే స్వదేశంలో శ్రీలంకపై భారత్‌ పూర్తి అధిపత్యం చెలాయించింది. ఇప్పటి వరకు భారత్ లో లంక రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది.