Begin typing your search above and press return to search.

అంతర్వేది స్వామి రథం అగ్నికి ఆహుతి... పీఠాధిపతి వివరణ

By:  Tupaki Desk   |   6 Sep 2020 9:00 AM GMT
అంతర్వేది స్వామి రథం అగ్నికి ఆహుతి... పీఠాధిపతి వివరణ
X
ఏపీలోని ప్రముఖ హిందూ దేవాలయం అయిన అంతర్వేదిలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్వామి వారి ఉత్సవ రథం అగ్నికి ఆహుతైంది.

కాగా ఇలా రథం అగ్నికి ఆహుతి కావడం అరిష్టమని అందరూ ఆందోళన చెందుతున్నారు. దీనిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి స్పందించారు.

‘అంతర్వేది ఘటన దురదృష్టకరం.. విచారణ జరపాలి. దుండగులపై చర్య తీసుకోవాలి. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం ఇదీ’ అని స్వరూపానంద అన్నారు. స్వామి నూతన రథ నిర్మాణం దేవాదాయ శాఖ చేపట్టాలని స్వరూపానంద వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.

ఈ ప్రమాదంపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి స్పందించారు. కమిషనర్, కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరారు. కాగా కొంతమంది దుండగులే ఈ రథాన్ని అగ్నికి ఆహుతి చేసినట్టు తెలుస్తోంది.