Begin typing your search above and press return to search.
ఏసీబీ అదుపులో ఈఎస్ ఐ డైరెక్టర్...
By: Tupaki Desk | 27 Sep 2019 7:38 AM GMTతెలంగాణ ఈ ఎస్ ఐ ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా మందులు కొనుగోళ్ళు చేసి వందల కోట్ల రూపాయల కుంభకోణం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఎస్ ఐ డైరెక్టర్ దేవికా రాణిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. కాయకష్టం చేసి కాసింత కూడబెట్టుకుని బతుకున్న పేద కార్మికులు అనారోగ్యం పాలైతే సక్రమైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చూపే ఈ ఎస్ ఐ ఇప్పుడు ఏకంగా అదే పేద కార్మికుల పేరుతో రూ.200 కోట్ల మందులు కొనుగోలు చేసినట్లు దొంగ రశీదులు సృష్టించి - సుమారు రూ.100 కోట్లకు పైగా అవినీతి అక్రమాలకు పాల్పడి సంచలనం సృష్టించింది.
ఓ గుర్తు తెలియని వ్యక్తి 2018 నవంబర్ 3న విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ కు ఇచ్చిన సమాచారంతో కదలిన ఏసీబీ అధికారులు తీగ లాగితే డొంక కదిలినట్లైంది. ఏసీబీ రంగంలోకి దిగి విచారణ చేపట్టి చివరికి ఈ ఎస్ ఐ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణిని - మరో ఏడుగురు ఉద్యోగులను అరెస్టు చేయడం వరకు వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు ఈ ఎస్ ఐ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పిర్యాదు చేశారు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఏసీబీ అధికారులను రంగంలోకి దింపారు.
ఏసీబీ ఏకకాలంలో 23 మంది ఉద్యోగులు - డైరెక్టర్ బంధువుల ఇళ్లలో సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. దాదాపు 24 గంటలపాటు సుధీర్ఘంగా తనిఖీలు చేపట్టింది. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. 10 కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్టుగా పత్రాలతో సహా ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఉపయోగం లేని మందులు కొనుగోలులో గోల్ మాల్ చేసినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించి చివరికి శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేసింది.
షేక్‌పేటలోని డైరెక్టర్ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు డైరెక్టర్ దేవికారాణిని - ఆమె కొడుకు - ఫార్మాసిస్ట్ రాధిక - ఉద్యోగి నాగరాజు - జాయింట్ డైరెక్టర్ పద్మ - అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిరాతో పాటు మరొకరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ జరిపిన విచారణలో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు తెలిసినట్లు సమాచారం. డైరెక్టర్ దేవికారాణికి అనేక చోట్ల బినామీ కంపెనీలు ఉన్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. అరెస్ట్ చేసిన డైరెక్టర్ ను ఏసీబీ కార్యాలయానికి తరలించారు.