Begin typing your search above and press return to search.

సభలో సభ్యుల పై అనర్హత వేటు ఎలా - ఎందుకు వేస్తారు?

By:  Tupaki Desk   |   1 Jan 2020 7:17 AM GMT
సభలో సభ్యుల పై అనర్హత వేటు ఎలా - ఎందుకు వేస్తారు?
X
రాజకీయాలలో పదివి అన్న ఎలా శాశ్వతం కాదో ..ఒకే పార్టీలో నేతలు కొనసాగడం కూడా శాశ్వతం కాదు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే రాజకీయాలలో ఆయా రామ్.. గయా రామ్ అన్న పదం బాగా ఫెమస్ అయ్యింది. అయితే, అసలు ఈ ఆయా రామ్.. గయా రామ్ పదం ఎందుకొచ్చిందన్న దానిపై చాలా మందికి తెలియదు. రాజకీయలలో ఒక పార్టీ గుర్తు పై గెలిచి.. ఆ తర్వాత మరో పార్టీలోకి జంప్ చేసే వారిని.. ఆ తర్వాత మరో పార్టీలోకి మారేవారిని ఉద్దేశించి ఎక్కువగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు.

1967 సంవత్సరంలో హర్యానాలో ఒ ఎమ్మెల్యే ఒకే రోజు మూడు పార్టీలు మారారు. అయన పేరు గయా లాల్. అయితే ఇలా ఒక పార్టీలో గెలిచి - ఇంకో పార్టీలోకి వెళ్లేవారికి చెక్ పెట్టేందుకు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా.. పార్టీ ఫిరాయింపులను నివారించేందుకు చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిని పదవ షెడ్యూల్‌ లో పొందుపరిచారు. ఈ ఫిరాయింపుల చట్టం ద్వారా.. సభ్యులను డిస్‌ క్వాలిఫై చేయొచ్చు. అయితే , ఈ పక్రియ కి కూడా ఒక పద్దతి అంటూ ఉంది. ఆలా ఆ పక్రియ ద్వారా ఈ వ్యవహారం మొత్తం జరుగుతుంది.

ఒక పార్టీ గుర్తుపై గెలిచి , మరో పార్టీలోకి వెళ్లిన సమయంలో కానీ.. లేక పార్టీ ఆదేశాలను ధిక్కరించినప్పుడు కానీ, విప్ జారీ చేసిన సమయంలో పార్టీ చెప్పిన విధంగా నడుచుకోకుండా, ఉన్న సమయంలో అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా బిల్లు పై సభలో జరిగే ఓటింగ్ సమయంలో కూడా పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్‌ కు పాల్పడితే ఆ సభ్యుడిపై అనర్హత వేటు వేయవచ్చు. అయితే దీనికి సంబంధించిన అధికారాలు సభలో ఒక్క స్పీకర్‌ కు మాత్రమే ఉంటాయి. ఆ సభ్యుడిపై సంబంధిత పార్టీ స్పీకర్‌ కు లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలి. ఆ తరువాత దాని పై స్పీకర్ తీసుకునే నిర్ఱయం ఆధారంగా , ఆ సభ్యుడి పై అనర్హత వేటు పడుతుంది. అయితే ఇక్కడ పార్టీ మారే ఎమ్మెల్యేలకు అనర్హత వేటు పడకుండా కూడా మరో అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఒక పార్టీకి చెందిన సభ్యులు మూడింట రెండువంతుల మంది సభ్యులంతా ఒకే పార్టీలో మారాలనుకుంటే.. అప్పుడు సదరు పార్టీనే ఇంకో పార్టీలో విలీనం చేయవచ్చు. అప్పుడు, అసలు పార్టీలో ఉన్న సభ్యులే అనర్హతను ఎదుర్కోవాల్సి వస్తుంది.