Begin typing your search above and press return to search.
యాంటీ మోడీ పాలిటిక్స్: బీహార్ సీఎంతో కేసీఆర్
By: Tupaki Desk | 30 Aug 2022 5:13 AM GMTమోడీ వ్యతిరేకులందరినీ ఒక జట్టుగా చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాజకీయం మొదలుపెట్టారు. ఇటీవల మోడీతో తెగదెంపులు చేసుకొని బయటకొచ్చి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కలిసేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆగస్ట్ 31న పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్‌ను కలువనున్నారు. దీంతో ఈ భేటి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఈమేరకు ప్రకటన చేసింది. లంచ్ మీటింగ్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాలపై చర్చిస్తారు.
ఈ నెల ప్రారంభంలో బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు జనతాదళ్-యునైటెడ్ నేత నితీష్ కుమార్. ఇప్పుడు మోడీతో కటీఫ్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తొలిసారి సమావేశం కానున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలకు తానే నాయకత్వం వహిస్తానని నితీష్ కుమార్ చేసిన ప్రకటన దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఇప్పటికే తన ఆకాంక్షను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) చీఫ్, నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపిని ఎదుర్కోవడానికి భావసారూప్యత గల పార్టీల కూటమిని ఏర్పాటు చేయాలనే తన ప్రణాళికలో భాగంగా బీహార్ సీఎంతో చర్చించే అవకాశం ఉంది.
26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలతో రెండు రోజుల సమావేశం అనంతరం కేసీఆర్ బీహార్‌లో పర్యటించనున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించాలని, వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా ప్రతిబింబించాలని రైతు నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే బీహార్ సీఎంతో కేసీఆర్ భేటి కానున్నారు.
ఆగస్టు 31 ఉదయం ముఖ్యమంత్రి పాట్నాకు బయలుదేరి వెళతారు. గాల్వాన్ లోయలో అమరులైన భారత జవాన్ల కుటుంబాలకు నితీష్ కుమార్‌తో కలిసి ఆర్థిక సహాయం అందజేయనున్నారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున చెక్కులను అందజేస్తారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ కార్మికుల కుటుంబాలకు కూడా కేసీఆర్ ఆర్థిక సహాయం చేయనున్నారు. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెక్కులను అందజేయనున్నారు.
గాల్వాన్ లోయ అమరవీరుల కుటుంబాలకు మరియు కేంద్రం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన రైతులకు ఆర్థిక సహాయం పంపిణీ చేయడానికి కేసీఆర్ గతంలో మేలో పంజాబ్‌లో పర్యటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయన వెంట ఉన్నారు. మార్చిలో కేసీఆర్ తన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో కలిసి రాంచీని సందర్శించారు.
ఇద్దరు సైనికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చెక్కులను అందజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 19 మంది సైనికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇస్తుందని 2020లో కేసీఆర్ ప్రకటించారు. జూన్ 15, 2020న లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 19 మంది సైనికులతో పాటు మరణించిన కల్నల్ బి. సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు ఇచ్చింది. సంతోష్ బాబు సూర్యాపేట నివాసి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరణించిన వారి కుటుంబాలను ఆ రాష్ట్రాలకు వెళ్లి మరీ కేసీఆర్ ఆర్తిక సాయం చేస్తున్నారు.
ఈక్రమంలోనే బీహార్ సీఎంతోనూ కేసీఆర్ మోడీ వ్యతిరేక ఫ్రంట్ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటి ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.