Begin typing your search above and press return to search.
ఢిల్లీలో చేసిన ఆఖరి ప్రయత్నం ఫెయిలయింది
By: Tupaki Desk | 21 Dec 2017 8:17 AM GMTదేశ రాజధాని ఢిల్లీలో చేసిన ఆఖరి ప్రయత్నం ఫెయిలయింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం నడుం బిగించి ‘యాంటీ స్మోగ్ గన్’ను ప్రయోగించడం ద్వారా వాయు కాలుష్యాన్ని కాస్తయినా తగ్గించవచ్చని కేజ్రీవాల్ ప్రభుత్వం యోచించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అత్యధికంగా కాలుష్యం బారిన పడ్డ ఆనంద్ విహార్ ప్రాంతంలో ఈ గన్స్ ను ప్రయోగాత్మంగా పరీక్షించారు. అయితే ఇది ఫలితం ఇవ్వలేదు.
ఢిల్లీలోనే అత్యంత కాలుష్య ప్రాంతంగా పేరున్న ఆనంద విహార్ వద్ద ఈ పరికరాన్ని బుధవారం పరీక్షించారు. తొలుత పరికరం నుంచి నీటిని వాతావరణంలోకి వెదజల్లారు. కాని కాలుష్య కణాలను అరికట్టడంలో అది చాలా స్వల్ప ప్రభావాన్ని మాత్రమే చూపించింది. కృత్రిమ తేమను సృష్టిస్తూ పరికరం 50 మీటర్ల ఎత్తులో నీటిని వెదజల్లింది. ఈ నీరు వాతావరణంలోని కాలుష్య కణాలను నేలపై పడేస్తుందని ఆశించారు. ఆశించిన స్థాయిలో అది ఫలితానివ్వలేదు. పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ - ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో కాలుష్య నియంత్రణ కేంద్రం సమీపంలోని ఆనంద్ విహార్ వదరా పరికరాన్ని పరీక్షించారు. దీనిపై హుస్సేన్ మాట్లాడుతూ ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) సేకరించిన డేటాను పరిశీలించిన తరువాత దీనిని నగరంలో మరెక్కడైనా ఉపయోగించే విషయమై ఆలోచిస్తామన్నారు. అంతకుముందు ''యాంటి స్మాగ్ గన్''గా పిలవబడే ఈ పరికరాన్ని సోమవారం ఢిల్లీ సెక్రటరియేట్ వద్ద పరీక్షించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా - పర్యావరణ శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ లు హాజరయ్యారు.
ఒక వాటర్ ట్యాంక్ కు అనుసంధానించబడిన ఈ పరికరం వాతావరణంలోకి నీటిని వెదజల్లుతుంది. ఇందులోంచి వెలువడే పరిశుభ్రమైన నీటి కణాలు వర్షంలా పడతాయి. వాతావరణంలో ఉన్న ప్రాణాంతక కాలుష్య కణాలను ఈ నీటి కణాలు నివారిస్తాయి. ఈ పరికరాన్ని ఒక వాహనంపై ఉంచి నగరమంతా తీసుకెళ్ళి ఉపయోగించనున్నారు. ఈ పరికరం ద్వారా 50 మీటర్ల ఎత్తు వరకు నీటిని వెదజల్లవచ్చునని దీని తయారీదారైన 'క్లౌడ్ టెక్' ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. అయితే దీనిని ఉపయోగించడానికి ముందు మరిన్నిసార్లు పరీక్షించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రూ.20 లక్షలు వ్యయంతో ఈ పరికరాన్ని రూపొందించినట్లు వారు చెప్పారు.
ఇదిలాఉండగా...ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా చేయడానికి ప్రభుత్వ ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుందని అన్నారు. కాలుష్య కారకాలైన వాహనాలకు విద్యుత్ బ్యాటరీలు అమర్చడం, డీజిల్ వాహనాలను నిషేధించడం వంటి చర్యలు అందులో భాగమన్నారు. యాంటీ స్మాగ్ గన్ ను వాహనాలకు అమర్చి సులభంగా నీటిని వెదజల్లవచ్చని మంత్రి చెప్పారు. తొలి ప్రయోగం విజయవంతమైతే మరిన్ని ప్రాంతాల్లో గన్స్ ను ఉపయోగిస్తామన్నారు. చైనాలో ఈ ప్రక్రియ విజయవంతమైందని మంత్రి వెల్లడించారు.