Begin typing your search above and press return to search.

ఎమిటీ అల్పాకా? మానవాళికి ఇప్పుడో ఆశాకిరణం ఎలా?

By:  Tupaki Desk   |   29 Jun 2020 1:40 PM IST
ఎమిటీ అల్పాకా? మానవాళికి ఇప్పుడో ఆశాకిరణం ఎలా?
X
మాయదారి మహమ్మారికి యావత్ ప్రపంచం వణుకుతోంది. దీనికి చెక్ చెప్పేందుకు దాదాపు పన్నెండు ప్రముఖ సంస్థలు రాత్రి పగలు అన్న తేడా లేకుండా వ్యాక్సిన్ తయారీ కోసం కిందామీదా పడుతున్నాయి. ఇదిగో వచ్చేస్తుంది.. అదిగో వచ్చేస్తుందని చెప్పేస్తున్నప్పటికీ వ్యాక్సిన్ మాత్రం ఇప్పటికి రాని పరిస్థితి. మరోవైపు పాజిటివ్ కేసులు కోటికి చేరుకోవటంతో పాటు.. రానున్న రోజుల్లో మరెన్ని కేసులు తెర మీదకు వస్తాయో అర్థం కాని పరిస్థితి. ఇలాంటివేళ.. ఒక శుభవార్త బయటకు వచ్చింది.

మహమ్మారి అంతు చూసేందుకు ఉన్న మార్గాల్ని వెతికే పనిలో ఉన్నదక్షిణ ఆఫ్రికా.. స్వీడన్ పరిశోధకులు తాజాగా జరిపిన రీసెర్చ్ లో కొత్త విషయాన్ని గుర్తించారు. అదేమంటే.. మన దగ్గర గొర్రెలు.. మేకలు ఎలా ఉంటాయో అదే రీతిలో అల్పాకా అనే జంతువులు మానవాళికి కొత్త ఆశా కిరణాలుగా చెబుతున్నారు. మహమ్మారి నుంచి మనల్ని రక్షించే సత్తా వాటిలో పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నారు.

మనుషుల్లో ఉండే యాంటీబాడీస్ ను అడ్డుకొని చంపేసే శక్తి వాటి సొంతమని చెబుతున్నారు. అదెలా అన్న విషయానికి వస్తే.. అల్పాకాలో నానో బాడీస్ చాలా ఎక్కువ. వాటిని సేకరించి మనుషుల్లో ప్రవేశ పెట్టి చూస్తే.. అవి శరీరంలోకి వెళ్లి.. మహమ్మారికి అడ్డుగోడలా నిలవటమే కాదు.. వాటి పీచమణిచే శక్తి ఉందన్న విషయాన్ని గుర్తించారు. అయితే.. వీటి యాంటీ బాడీస్ సేకరించి ప్రజలకు ఇవ్వటానికి కొంతకాలం పడుతుందని చెబుతున్నారు. సుమారు రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇంతకీ వీటిలో ఉండే నానోబాడీస్ ఎలా పని చేస్తాయన్న విషయానికి వస్తే.. అల్పానాలో నుంచి తీసే యాంటీబాడీస్ ను మనిషికి ఎక్కించిన వెంటనే.. అవి రక్తంలో జారుకుంటూ వెళ్లి.. మహమ్మారి వద్దకు చేరుకుంటాయి. ఆ సమయంలో మహమ్మారి ఏ కణంలోకో వెళ్లే ప్రయత్నం చేస్తుంది. తన చుట్టూ ఉండే ముళ్లలాంటి కొవ్వు తో కణాన్ని గుచ్చుతూ ఉంటుంది.అలాంటి వేళలో.. వెళ్లే యాంటీబాడీస్ మహమ్మారి ముళ్లకు అడ్డుగా నిలుస్తాయి. ఎప్పుడైతే.. ఇవి కరోనాను తాకుతాయో.. వాటి కొవ్వు కరిగి పోతుంది.అవి ఎప్పుడు కరిగిపోతాయో.. అప్పుడే మహమ్మారి ముప్పు ముగుస్తుంది. వైరస్ చచ్చి పోతే.. అక్కడి తో శుభం కార్డే. వినేందుకు బాగున్నా.. అందుబాటులోకి వచ్చి.. సానుకూల ఫలితాలు వస్తే.. అంతకు మించింది మరేం కావాలి చెప్పండి?