Begin typing your search above and press return to search.
కరోనాపై ఆ అధ్యయన రిపోర్టు చూస్తే.. దడ దడలాడాల్సిందే
By: Tupaki Desk | 14 July 2020 10:45 AM ISTప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కోవిడ్ 19కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు రకరకాల అధ్యయనాలు చేస్తున్నారు. దీని సంగతి తేల్చేందుకు కొందరు.. వ్యాక్సిన్ తయారీ చేయటంలో ఇంకొందరు.. ఇలా ఎవరికి వారు తాము చేయగలిగిందంతా చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా బ్రిటన్ కు చెందిన కింగ్స్ కాలేజీ నిర్వహించిన పరిశోధనలో కొత్త విషయాల్ని గుర్తించారు.
తాజాగా ఆ అంశాల్ని వారు వెల్లడించటం.. ఆ వివరాల్ని విన్న వారంతా అవాక్కు అవుతున్న పరిస్థితి. అంతేకాదు.. ఆ పరిశోధన వివరాల్ని తెలుసుకున్న వారి గుండెలు అదిరిపోతున్నాయి. ఇంతకీ.. ఆ రిపోర్టులో ఏమున్నదంటే..
- శరీరంలో ప్రవేశించే సూక్ష్మక్రిములపై పోరాడి రక్షించే సైనిక ప్రోటీన్లను యాంటీ బాడీలుగా అభివర్ణిస్తాం.
- కరోనాపై పోరాడే విషయంలో ఇవే కీలకంగా వ్యవహరిస్తుంటాయి
- అలాంటి యాంటీబాడీలు గడిచిన కొంతకాలంగా బాగా తగ్గిపోతున్నాయి
- కోవిడ్ పాజిటివ్ బారిన పడిన వారు.. తమకున్న రోగ నిరోధకతను కొద్దికాలంలోనే కోల్పోతున్నారు
- దీంతో.. సాధారణ జలుబు మాదిరి కోవిడ్ కూడా అదే పనిగా మళ్లీ మళ్లీ సోకే ప్రమాదం ఉంది
- ఇదే నిజమైతే.. కోవిడ్ కు చెక్ పెట్టేందుకు వీలుగా ఒకసారి వ్యాక్సిన్ సరిపోదు. మళ్లీ మళ్లీ వేయాల్సి ఉంటుంది
అంటూ కీలకమైన అంశాల్ని తమ పరిశోధనలో గుర్తించినట్లుగా కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్ కు వ్యాక్సిన్ కనుగునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బయటకు వచ్చిన అంశాల్ని సైతం పరిగణలోకి తీసుకొని వ్యాక్సిన్ రూపొందించటం మంచిదన్న మాట పలువురు పరిశోధకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. యాంటీబాడీలు తగ్గిపోవటం ఆందోళన కలిగించే అంశమే అయినా.. మరీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని మరికొందరు సైంటిస్టులు పేర్కొంటున్నారు.