Begin typing your search above and press return to search.
భారత్ లో అత్యంత ధనవంతులైన మహిళలు ఎవరో తెలుసా?
By: Tupaki Desk | 30 Nov 2022 2:30 AM GMTఫోర్బ్స్ దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాను విడుదల చేసింది. దేశంలో అదానీ నంబర్ 1గా నిలవగా.. నంబర్ 2గా అంబానీ నిలిచారు. ఇక ఫోర్బ్స్ రిచెస్ట్ ఉమెన్ -2022 డేటా కూడా విడుదలైంది. మహిళల్లో ఎవరు సంపాదనపరులో ఫోర్బ్స్ వెల్లడించింది. జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా ఖ్యాతిగడించింది.. సావిత్రి నికర విలువ 16.4 బిలియన్ డాలర్లు (రూ. 132,452.97 కోట్లు)గా ఉంది.. భారతదేశంలోని 100 మంది ధనవంతులు ఈ సంవత్సరం మరింతగా ధనవంతులయ్యారని, వారి మొత్తం సంపద $800 బిలియన్లకు పెరిగిందని డేటా సూచించింది.
దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో సావిత్రి జిందాల్ ఆరో స్థానంలో ఉన్నారు. అత్యంత సంపన్న మహిళల జాబితాలో వినోద్ రాయ్ గుప్తా తర్వాతి స్థానంలో ఉన్నారు. వినోద్ భర్త, కిమత్ రాయ్ గుప్తా 1958లో హావెల్స్ ఇండియాను స్థాపించారు. వినోద్ రాయ్ తన కుమారుడు అనిల్ రాయ్ గుప్తాతో కలిసి కంపెనీని నడుపుతున్నారు. వారి నికర విలువ రూ. 50,881.32 కోట్లు.
బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా భార్య రేఖ మూడవ అత్యంత సంపన్నురాలు. ఆమె సంపద విలువ రూ. 47,650.76 కోట్లు. ఆగస్ట్ 2022లో రాకేష్ ఆకస్మిక మరణం తర్వాత రేఖ పగ్గాలు చేపట్టింది. ఆమె మొత్తం భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 30వ స్థానంలో ఉంది.
అందం మరియు ఫ్యాషన్ రిటైలర్ నైఖా వ్యవస్థాపకుడు, ఫల్గుణి నాయర్ రూ. 32,951.71 కోట్ల ($4.08 బిలియన్) సంపదతో నాల్గొవ సంపన్న మహిళగా నిలిచారు.. ఫల్గుణి నాయర్ స్వీయ బిలియనీర్ గా ఎదిగారు. ఆమె విజయగాథ చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు.
2018లో జర్మన్ జెనరిక్స్ సంస్థ జూటా ఫార్మాను కొనుగోలు చేసిన ప్రైవేట్ యూఎస్వీ ఇండియా చైర్ లీనా తివారీ విలువ రూ. 30,205.74 కోట్లు. దివ్య గోకుల్‌నాథ్ తన భర్త బైజూ రవీంద్రన్‌తో కలిసి 2011లో బైజూస్ ని స్థాపించిన తర్వాత అత్యంత సంపన్న మహిళగా అవతరించింది.. ఈ జంట రూ.29,075.04 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. బైజూస్ భారత క్రికెట్ జట్టుకు అధికారిక స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది.
80 ఏళ్ల అను అగా భారతదేశపు అత్యంత సంపన్న మహిళల జాబితాలోకి వచ్చింది. ఆమె విలువ $2.23 బిలియన్లు లేదా రూ. 18,010.37 కోట్లు. అను ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ బిజినెస్ అయిన థర్మాక్స్‌కు ఈమె నాయకత్వం వహిస్తుంది.ఆమె 2018లో కంపెనీ నుండి రిటైర్ అయ్యింది కానీ కంపెనీలో ఎక్కువ వాటాను కలిగి ఉంది. అలా ధనవంతుల జాబితాలోకి వచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.