Begin typing your search above and press return to search.

బీజేపీకి షాకిచ్చిన రియ‌ల్ చాయ్ వాలా

By:  Tupaki Desk   |   5 Dec 2017 4:24 AM GMT
బీజేపీకి షాకిచ్చిన రియ‌ల్ చాయ్ వాలా
X
చాయ్ వాలా ఏంది? బీజేపీకి షాకివ్వ‌టం ఏంటి? అయితే గియితే చాయ్ వాలా బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన బీజేపీ ఇవ్వాలే కానీ.. ఈ రివ‌ర్స్ గేరేంద‌న్న సందేహాలు వ‌ద్దు. నిజంగానే నిజం.. చాయ్ వాలా ప్ర‌ధాని అయ్యారంటూ గొప్ప‌లు చెప్పే బీజేపీ.. అదే పేరుతో ఒకరు కార్పొరేట‌ర్ అయిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

చిన్న‌ప్పుడు చాయ్ అమ్మిన. నేనో సామాన్యుడ్ని. నాలాంటోడు దేశ ప్ర‌ధాని ఎందుకు కాకూడ‌దంటూ ముఖ్య‌మంత్రి హోదాలో మోడీ సాబ్ వేసిన ప్ర‌శ్న‌కు అంద‌రూ అవును.. నిజ‌మే.. చాయ్ వాలా ప్ర‌ధాని ఎందుకు కాకూడ‌దంటూ ఫీలైపోయి మ‌రీ ఓట్లు గుద్దేశారు. ముఖ్య‌మంత్రిగా ఉన్న‌న్ని రోజులు త‌న చాయ్ వాలా స్టోరీని మోడీ ఎందుకు రివీల్ చేయ‌లేద‌న్న క్వ‌శ్చ‌న్‌ ను ఎవ‌రూ వేసుకోలేదు.

అదే మ‌రి మోడీ అంటే. ఎప్పుడేం అవ‌స‌ర‌మో అదే బ‌య‌ట‌కు చెప్పే మోడీ లాంటి జూనియ‌ర్ మోడీ గురించి ఇప్పుడు చెప్పేది. ఈ మ‌ధ్య‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగాయి క‌దా? ఆ ఎన్నిక‌ల్లో టీ కాచే ఓ వ్య‌క్తికి అర్జెంట్‌ గా వార్డు మెంబ‌ర్ కావాల‌నిపించింది. చాయ్ అమ్మే తాను వార్డు మెంబ‌ర్ ఎందుకు కాకూడ‌దు.. త‌మ కుల పెద్ద (ఛాయ్ అమ్మడంలో ) అయిన మోడీ ప్ర‌ధాని అయిన‌ప్పుడు అఫ్ట‌రాల్ వార్డు మెంబ‌రు కావ‌టం ఓ లెక్కా అనుకున్నాడు. అంతే రంగంలోకి దిగేశాడు. అయితే.. అత‌నికి ప్ర‌త్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన‌ నేత సామాన్యుడు కాదు..అప్ప‌టికే ప‌దిసార్లు స్థానిక ఎన్నిక‌ల్లో గెలిచిన భారీ బ్యాట్స్ మెన్‌.

అయితే.. చాయ్ వాలా సెంటిమెంట్‌ ను న‌మ్ముకొని బ‌రిలోకి దిగిన ఆత‌న్ని ప్ర‌జ‌లు ఓట్లేసి మ‌రీ గెలిపించి.. చాయ్ వాలా సెంటిమెంట్ ప‌వ‌రేందో అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేశారు. ప్ర‌తిచోటా చాయ్ వాలా నినాదంతో ప్ర‌త్య‌ర్థుల్ని దెబ్బేసే బీజేపీకి ఈ రియ‌ల్ చాయ్ వాలా ఇచ్చిన షాక్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యే ప‌రిస్థితి. ఇంత‌కీ ఇదెక్క‌డ జ‌రిగింద‌న్న ముచ్చ‌ట‌లోకి వెళితే..

యూపీలోని చిత్రకూట్ కు చెందిన 21 ఏళ్ల అనూజ్ నిగ‌మ్ చాయ్ అమ్ముతుంటాడు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 21వ వార్డులో బీజేపీ అభ్య‌ర్థి అజ‌య్ కుమార్ పై ఎస్పీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగాడు. గ‌డిచిన ప‌ది ఎన్నిక‌ల్లో తిరుగులేని రీతిలో నాన్ స్టాప్ విజ‌యాలు సాధిస్తున్న అజ‌య్ పై చాయ్ వాలా అద్భుత విజ‌యాన్ని సాధించాడు. అజ‌య్‌కు 286 ఓట్లు వ‌స్తే.. చాయ్ వాలా అనూజ్‌ కు 326 ఓట్లు సొంతం చేసుకున్నాడు. చాయ్ వాలా దేశ ప్ర‌ధాని అయితే.. మ‌రో చాయ్ వాలా వార్డు మెంబ‌రు ఎందుకు కాకూడ‌ద‌ని తాను అనుకున్నాన‌ని.. అదే త‌న విజ‌యానికి కార‌ణంగా చెప్పాడు. చాయ్ వాలా కావ‌టంతో త‌న షాపుకు వ‌చ్చే వారితో త‌న‌కు చ‌క్క‌టి సంబంధాలు ఉన్నాయ‌ని.. అదే త‌న‌ను ఎన్నిక‌ల్లో గెలిచేలా చేసింద‌ని చెప్పుకొచ్చాడు. సో.. ఏతావాతా తేలేదేమంటే.. చాయ్ వాలా సెంటిమెంట్ బీజేపీకి మాత్ర‌మే సొంతం కాదు.. అంద‌రికి సొంత‌మే. చాయ్ వాలాలు.. మీ స‌త్తా చూపించుకోవ‌టానికి సిద్ధం కండి.