Begin typing your search above and press return to search.
అనుపమ్ ఖేర్ తెలివైనోడే
By: Tupaki Desk | 2 Dec 2015 9:53 AM GMTఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాబోనని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ చెబుతున్నారు. రాజకీయాల్లోకి రాకపోయినా తాను కోట్లాదిమంది భారతీయులకు ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడతానని ఆయన ప్రకటించారు. భారత్ ను మించిన దేశం లేదని నమ్మేవారితో కలిసి సాగుతానని.. వారి తరఫున మాట్లాడుతానని అన్నారు.
సోషల్ మీడియాలో అభిమానులతో, స్నేహితులతో ఆయన సరదాగా చాట్ చేసినపుడు ఈ ప్రస్తావన వచ్చింది. అనుపమ్ భార్య కిరణ్ ఖేర్ బీజేపీలో చేరి ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే నెటిజన్లు అనుపమ్ కు ఈ ప్రశ్న వేశారు. అందుకు స్పందించిన ఆయన తాను రాజకీయాల్లోకి రావడం అసాధ్యమన్నారు. నటుడిగా, స్ఫూర్తిమంతమైన ఉపన్యాసకుడిగా ఉండటమే తనకు ఇష్టమని చెప్పారు. ఇంతకుముందు కూడా ఆయన తనకు సినిమాల కంటే దేశమే ప్రధానమని ప్రకటించారు. మొన్న అమీర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా అనుపమ్ ఆయనకు గడ్డిపెట్టారు. రాజకీయాలు బురదలాంటివని.. ఆ బురద ఒంటికి అంటించుకోవడం కంటే ఒడ్డునే ఉండడం బెస్టని ఆయన అనుకుంటున్నట్లుంది. అందుకే నో పాలిటిక్స్ అనేశారు. ఎంతైనా అనుపమ్ తెలివైనవాడే.