Begin typing your search above and press return to search.
మళ్లీ రాహుల్ గాంధీ గాలి తీశాడు
By: Tupaki Desk | 6 Dec 2016 9:22 AM GMTకొన్ని నెలల కిందట దేశంలో మత అసహనం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సమయమది. కోల్ కతాలో ఎన్డీటీవీ ఆధ్వర్యంలో ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఆ వేదికలో చాలామంది మేధావులు వేదికెక్కి మత అసహనం గురించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అనుపమ్ ఖేర్ వంతొచ్చింది. వేదిక మీదున్న జస్టిస్ గంగూలీని ఉద్దేశించి ప్రసంగం మొదలుపెట్టాడు అనుపమ్. మిమ్మల్ని చూసి.. మీ వ్యాఖ్యల్ని చూసి సిగ్గుపడుతున్నానంటూ అనుపమ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభలో కలకలం రేగింది. ఆ తర్వాత ఆయన ఫోకస్ రాహుల్ గాంధీ మీదికి మళ్లింది. రాహుల్ పేరెత్తకుండానే.. అలాంటి పనికి రాని వాడిని నాయకుడిగా భరిస్తున్న కాంగ్రెస్ పార్టీది అతి పెద్ద సహనం అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు అనుపమ్. సభ మొత్తం హోరెత్తిపోయింది ఆ వ్యాఖ్యలతో. ఇలాంటి తూటాల్లాంటి మాటలు మరిన్ని పేల్చాడు అనుపమ్. ఫుల్ ఫైర్ ఉన్న ఆ స్పీచ్ వాట్సాప్.. యూట్యూబ్.. ఇతర సామాజిక వేదికల్లో వైరల్ అయింది.
తాజాగా అనుపమ్ ఖేర్ మరోసారి రాహుల్ గాంధీని టార్గెట్ చేశాడు. థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించాలన్న నిబంధనపై ఆయన స్పందిస్తూ.. రాహుల్ మీదికి తన ఫోకస్ షిఫ్ట్ చేశాడు. రాహుల్ జాతీయ గీతం ఆలపిస్తే చూడాలని ఉందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీకి ఉన్న దేశాభిమానం మీద తనకు అనుమానం లేదంటూనే.. రాహుల్ జాతీయ గీతం ఆలపిస్తే వినాలని ఉందని ఆయనన్నారు. రాహుల్ కు జాతీయ గీతం పాడటం వచ్చా అని.. అలాగే అందులోని పదాలకు అర్థం తెలుసా అని తనకు అనుమానంగా ఉందని అనుపమ్ వ్యాఖ్యానించడం విశేషం. థియేటర్లలో జాతీయ గీతం వినిపించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. అనుపమ్ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ రాహుల్ గాలి తీసే ప్రయత్నం మాత్రం సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/