Begin typing your search above and press return to search.
యూపీ బిజెపి సీఎం అభ్యర్థిగా అనుప్రియ?
By: Tupaki Desk | 6 July 2016 6:16 AM GMTప్రధాని మోడీ తన మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నారని ఇప్పటికే విశ్లేషణలు వస్తున్నాయి. అయితే... యూపీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిని కూడా ఆయన ఇప్పటికే డిసైడ్ చేశారని.. ఆ అభ్యర్థికి ప్రాధాన్యం - ప్రాచుర్యం కల్పించేందుకు తన మంత్రివర్గంలో స్థానమిచ్చారని వినిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలోకి తాజాగా తీసుకున్న అనుప్రియ పటేల్ ను యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన రాజకీయ నేపథ్యం - ఓబిసి మూలాలు కలిగిన అనుప్రియ పటేల్ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించనుందని వినిపిస్తోంది. ప్రధాని మోదీకి విధేయురాలిగా భావిస్తున్న అనుప్రియ అప్నాదళ్ టికెట్ పై మీర్జాపూర్ నుంచి ఘన విజయం సాధించారు. యూపిలో అప్నాదళ్‌కు బలమైన ఓబిసి ఓటు బ్యాంకు ఉంది - దీని దృష్ట్యానే ఆమెను సిఎం అభ్యర్థిగా రంగంలోకి దింపే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. తాజాగా ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంలోని ఉద్దేశం కూడా ఇదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 35 ఏళ్ల అనుప్రియను కేబినెట్ లోకి తీసుకునే విషయంలో మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు.
యూపీలో బిజెపి మిత్రపక్షమైన అప్నాదళ్ తరఫున మీర్జాపూర్ లోక్‌సభకు పోటీచేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆమె తండ్రి - కుర్మీ సామాజిక వర్గనేత సోనేలాల్ పటేల్ అప్నాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. 2009లో ఆయన మృతి చెందడంతో తల్లి కృష్ణపటేల్ పార్టీ పగ్గాలు చేపట్టారు. తరువాత పార్టీలోనూ విభేదాలు తలెత్తాయి. అనుప్రియ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సొంత తల్లే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో అనుప్రియకు మోదీ కేబినెట్ లో చోటు దక్కడం అంతటా చర్చానీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారని అంటున్నారు.