Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురిలో అనురాగ్ కే ప‌ట్టం!

By:  Tupaki Desk   |   9 Nov 2015 1:51 PM GMT
ఆ ముగ్గురిలో అనురాగ్ కే ప‌ట్టం!
X
తెలంగాణ డీజీపీ కోసం గ‌త కొంత‌కాలంగా సాగుతున్న ప్ర‌య‌త్నాలు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లే. ఆ మ‌ధ్య‌న పూర్తి స్థాయి డీజీపీ నియ‌మాకం కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రం నుంచి పేర్లు అడ‌గ‌టం..దానికి ఐదుపేర్లు పంప‌టం తెలిసిందే. ఆ జాబితా నుంచి ముగ్గురు పేర్ల‌ను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ మూడు పేర్ల‌ను తాజాగా తెలంగాణ రాష్ట్రం యూపీఎస్సీకి పంపింది.

తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా పంపిన పేర్ల‌లో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారులు అరుణా బ‌హుగుణ‌.. అనురాగ్ శ‌ర్మ‌.. ఏకే ఖాన్ పేర్లు ఉన్నాయి. వీరిలో ఒక‌రిని తెలంగాణ డీజీపీగా నియ‌మించ‌నున్నారు. వీరిలో తెలంగాణ డీజీపీగా ఎవ‌రు ఎంపిక అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి డీజీపీగా అనురాగ్ శ‌ర్మ డీజీపీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌.. ప్ర‌స్తుత క‌స‌ర‌త్తును ప‌రిశీలిస్తే.. ఈ ముగ్గురిలో ఎవ‌రు డీజీపీగా ఎంపిక అవుతార‌న్న అంశంపై అధికార‌.. ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. షార్ట్ లిస్ట్ లో ఉన్న ముగ్గురిలో అరుణ బ‌హుగుణ తెలంగాణ డీజీపీగా రావ‌టానికి సుముఖ‌త వ్య‌క్తం చేయ‌టం లేద‌ని తెలిసింది. ఇక‌.. మిగిలిన ఇద్ద‌రిలో అనురాగ్ శ‌ర్మ‌నే ఎంపిక చేసే అవ‌కాశం మొండుగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. గ‌త ఏడాదిన్న‌రగా తెలంగాణ డీజీపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న అనురాగ్ శ‌ర్మ‌తో తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గలేదు. ప‌లు కీల‌క సంద‌ర్భాల్లోనూ ఎలాంటి ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు లేకుండా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా ఎవ‌రికీ ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయ‌టంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యార‌ని.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తో ఉన్న స‌న్నిహిత సంబంధాల కార‌ణంగా అనురాగ్ శ‌ర్మ‌నే తెలంగాణ డీజీపీగా ఎంపిక చేసే అవ‌కాశంగా ఉందంటున్నారు. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు కూడా అనురాగ్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. ఊహించ‌ని అంశాలు చోటు చేసుకుంటే త‌ప్పించి.. అనురాగ్ శ‌ర్మ కాకుండా మ‌రొక‌రు డీజీపీగా ఎంపిక కార‌ని చెబుతున్నారు.