Begin typing your search above and press return to search.

తెలంగాణకు పూర్తి స్థాయి డీజీపీ ఎవరు?

By:  Tupaki Desk   |   21 Sep 2015 9:47 AM GMT
తెలంగాణకు పూర్తి స్థాయి డీజీపీ ఎవరు?
X
రాష్ట్ర విభజన నేపథ్యంలో పూర్తి స్థాయి డీజీపీ ఏర్పాటు విషయంపై తెలంగాణ సర్కారు తీవ్రంగా మదింపు జరిపింది. తమకు తగినట్లుగా డీజీపీని ఏర్పాటు చేసుకునే విషయంలో ఐదుగురు పేర్లతో ఉన్న నివేదికను కేంద్రానికి పంపినట్లుగా చెబుతున్నారు. కేంద్రం సూచించిన అధికారిని తెలంగాణ ప్రభుత్వం నియమించుకోవాల్సి ఉంటుంది.

ఇక.. పూర్తిస్థాయి డీజీపీ కోసం తెలంగాణ సర్కారు ఎంపిక చేసిన పేర్లుగా ఐదుగురి అధికారుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక.. ఐదుగురి అధికారుల విషయానికి వస్తే.. అరుణబహుగుణ.. అనురాగ్ శర్మ.. ఏకే ఖాన్.. తేజ్ దీప్ కౌర్.. దుర్గా ప్రసాద్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకునే నిర్ణయానికి తగినట్లుగా పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఇన్ ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న అనురాగ్ శర్మకే పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

అనురాగ్ శర్మతో మినహాయిస్తే.. మిగిలిన నలుగురిలో ఒకరికి డీజీపీ బాధ్యతలు చేపట్టేందుకు సముఖంగా లేరని.. మరో ఇద్దరి విషయంలో కేంద్రం గుర్రుగా ఉందని.. వారి ట్రాక్ రికార్డులో ఉన్న కొన్ని అంశాలు వారికి పదోన్నతి లభించకుండా అడ్డుపడతాయని చెబుతున్నారు. ఇక.. మరొకరి విషయంలో తెలంగాణ ప్రభుత్వం వందశాతం సుముఖత వ్యక్తం చేయటం లేదని.. వీటన్నింటి దృష్ట్యా ఇప్పటికే ఇన్ ఛార్జ్ గా ఉన్న అనురాగ్ శర్మకే పూర్తిస్థాయి బాధ్యతలు కట్టబెట్టే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.