Begin typing your search above and press return to search.

ఐటీ చట్టం సవరణలకు నివేదిక!

By:  Tupaki Desk   |   3 Dec 2019 4:29 PM GMT
ఐటీ చట్టం సవరణలకు నివేదిక!
X
ఆదాయ పన్ను చట్టాన్ని సమీక్షించేందుకు నియమించిన టాక్స్ ఫోర్స్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్ చెప్పారు. రాజ్యసభలో మంగళవారం వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ టాస్క్ ఫోర్స్ సిఫార్సులను పరిగణలోకి తీసుకునే విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

ఆదాయ పన్ను చట్టాన్ని సమీక్షించి దేశంలో నెలకొన్న ఆర్థికావసరాలకు అనుగుణంగా కొత్తగా ప్రత్యక్ష పన్నుల చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం 2017లోనే ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన విషయం వాస్తవమేనని మంత్రి తెలిపారు. తదుపరి 2018 - 2019 సంవత్సరాలలో ఈ టాస్క్ ఫోర్స్ ను పునఃవ్యవస్థీకరించడం జరిగింది.

అలా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ గత ఆగస్టు 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు మంత్రి చెప్పారు. టాస్క్ ఫోర్స్ తన నివేదికలో చేసిన సిఫార్సులను బహిర్గతం చేయలేదని - అలాగే ఆ సిఫార్సులను పరిగణలోకి తీసుకునే అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.