Begin typing your search above and press return to search.

ఆర్థికశాఖ సహాయ మంత్రిపై విమర్శలు ..కారణం ఇదే !

By:  Tupaki Desk   |   14 May 2020 12:17 PM GMT
ఆర్థికశాఖ సహాయ మంత్రిపై విమర్శలు ..కారణం ఇదే !
X
కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ పై ట్విటర్ ‌లో నెటిజన్లు తీవ్రవిమర‍్శలు చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్‌ భారత ఆర్థిక వ్యవస్థపై ‍ప్రతికుల ప్రభావం చూపించబోదని మార్చి నెలలో ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ విజృంభిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది. ఈ కష్ట కాలంలో దెబ్బతింటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రధాని మోదీ ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పేరిట రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.

ఇక ఈ ప్యాకేజీలో భాగంగా చిన్న సంస్థలు, బ్యాకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు, రియల్టీ మొదలైన కొన్ని రంగాలకు దక్కే ప్రయోజనాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. అలాగే వలస కార్మికులు, చిన్న కారు రైతులకి , స్ట్రీట్ వ్యాపారులకు , ముద్ర లోన్లు తీసుకున్న వారికీ ఏ విదంగా ప్రయోజనం కలుగుతుందో గురువారం వివరించారు. ఆమె ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం‌ భాషల్లో వివరించారు. కాగా అదే సమయంలో ఈ ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకుర్ హింది భాషలో అనువదించి చెప్పారు. దీంతో కరోనా వైరస్‌ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతికుల ప్రభావం ఉండదని గతంలో మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ చేసిన చేసిన ట్విట్‌ ను గుర్తు చేస్తూ నెటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు.