Begin typing your search above and press return to search.

కోహ్లీ సూపర్‌ ఇన్నింగ్స్‌ కు అనుష్క ప్లైయింగ్‌ కిస్‌

By:  Tupaki Desk   |   11 Oct 2020 10:50 AM GMT
కోహ్లీ సూపర్‌ ఇన్నింగ్స్‌ కు అనుష్క ప్లైయింగ్‌ కిస్‌
X
ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభం నుండి కోహ్లీ నిరాశ పర్చుతూ వస్తున్నాడు. భార్య అనుష్క శర్మ ఆరోగ్యం విషయంలో ఆయనకు ఆలోచన ఉందా అంటూ కొందరు నెటిజన్స్‌ విమర్శలు గుప్పించారు. అనుష్క ప్రెగ్నెంట్‌ అవ్వడం వల్ల కోహ్లీ ఆటపై దృష్టి పెట్టలేక పోతున్నాడా అంటూ కూడా కొందరు ఇష్టానుసారంగా మీమ్స్‌ క్రియేట్‌ చేశాడు. ఈ సారి బెంగళూరు ఛాంపియన్‌ గా నిలుస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో కోహ్లీ వరుసగా ఫ్లాప్‌ అవ్వడంను అభిమానులు సైతం జీర్ణించుకోలేక పోయారు. దాంతో ఆయనపై మీమ్స్‌ చేశారు. ఎట్టకేలకు ఆయన తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌ తో సమాధానం చెప్పాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌ లో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీకి అతడి భార్య అనుష్క ప్లైయింగ్‌ కిస్‌ ఇచ్చి మరీ అభినందించింది.

కోహ్లీ ఎక్కువ శాతం మ్యాచ్‌ ల్లో అనుష్క కనిపిస్తుంది. అయితే వరుసగా ఫ్లాప్‌ అయ్యి ఈసారి సక్సెస్‌ అయిన కారణంగా ఆమె ఎమోషనల్‌ అయ్యింది. మంచి పెర్ఫార్మెన్స్‌ తో ఆమె హృదయాన్ని గెలుచుకున్న కోహ్లీ జట్టును గెలిపించడంతో పాటు బెంగళూరు అభిమానులకు స్వీట్‌ గెలుపును అందించాడు. అనుష్క మాత్రమే కాకుండా ఎంతో మంది విరాట్‌ అభిమానులు ఆయనకు ప్లైయింగ్‌ కిస్‌ లను టీవీల ముందు ఇచ్చారంటూ ఒక నెటిజన్‌ ఈ ఫొటోలకు కామెంట్‌ పెట్టాడు. కాస్త గ్యాప్‌ తర్వాత సక్సెస్‌ వస్తే ఆ కిక్కే వేరు అన్నట్లుగా కోహ్లీ ఆ కిక్‌ పొందాడు. ఈ ఫామ్‌ ను కంటిన్యూ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.