Begin typing your search above and press return to search.

అల్‌రౌండ్‌ షో తో అదరగొట్టిన అనుష్కా శర్మ .

By:  Tupaki Desk   |   3 Nov 2021 7:34 AM GMT
అల్‌రౌండ్‌ షో తో అదరగొట్టిన అనుష్కా శర్మ .
X
అనుష్క శర్మ గ్రౌండ్ లో అల్ రౌండ్ షో తో అదరగొట్టేసింది. మొదట బ్యాటింగ్ లో 72 పరుగులు చేసిన ఆమె.. తర్వాత బంతితోనూ విజృంభించింది. ఐదు వికెట్లను తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచింది. అంతేకాదు... ఫీల్డింగ్ లో పాదరసంగా కదులుతూ ఇద్దరు బ్యాటర్లను రనౌట్ చేసి తన జట్టును గెలిపించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అనుష్క శర్మ ఆటకు ఇప్పుడు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భవిష్యత్తులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డులకు చెక్ పెట్టనుందని కామెంట్లు చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ భార్య, అనుష్క హీరోయిన్‌ కదా, ఆమె ఎప్పటి నుంచి క్రికెట్‌ ఆడడం ప్రారంభించింది’ అని అయోమయానికి లోనయ్యారు. అయితే ఆగండి.. ఈ పోస్ట్‌ విరాట్‌ భార్య గురించి కాదు. భారత అండర్‌- 19 మహిళల క్రికెట్ జట్టు బ్యాటర్‌ గురించి. ఆమె పేరు కూడా అనుష్కా శర్మనే కావడం గమనార్హం. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ వేదికగా జరుగుతోన్న ఇండియా ఉమెన్స్‌ అండర్- 19 ఛాలెంజర్స్‌ ట్రోఫీలో అనుష్క 72 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే మ్యాచ్‌ మధ్యలోనే ఆమె బ్యాటింగ్‌ ను కొనియాడుతూ బీసీసీఐ మహిళల ట్విట్టర్‌ లో ఓ పోస్ట్‌ పెట్టింది.

మధ్యప్రదేశ్‌ కు చెందిన అనుష్క ప్రస్తుతం ఇండియా ఉమెన్స్‌ అండర్- 19 ఛాలెంజర్స్‌ ట్రోఫీలో ఇండియా- బి జట్టుకు కెప్టెన్‌ గా వ్యవహరిస్తోంది . మంగళవారం ఇండియా- ఎ తో జరిగిన మ్యాచ్‌ లో ఆమె ఆల్‌ రౌండ్‌ ప్రతిభను చూపింది. మొదట బ్యాటింగ్‌ లో 72 పరుగులు చేసిన అనుష్క ఆ తర్వాత బౌలింగ్‌ లోనూ ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్ను విరిచింది. ఫీల్డింగ్‌లోనూ రాణించి ఇద్దరు బ్యాటర్లను రనౌట్‌ చేసింది. ఇదిలా ఉండగా బీసీసీఐ మహిళల ట్విట్టర్‌లో అనుష్కా శర్మ గురించి పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఇదిలాఉండగా.. అనుష్క శర్మకు సంబంధించిన ఫీట్ పై బీసీసీఐ ఉమెన్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని ప్రకటించగానే నెటిజన్లు పలు ఆసక్తికర కామెంట్స్ పెట్టారు. అదేంటి.. కోహ్లి భార్య క్రికెట్ ఆడటం ఎప్పట్నుంచి మొదలుపెట్టింది. అని పలువురు స్పందించగా.. విరాట్, అనుష్కల సంబంధించిన మీమ్స్ చేస్తూ దీనిని వైరల్ చేశారు అన్నట్టు ఈ మ్యాచ్ లో ఇరగదీసిన అనుష్క శర్మ మధ్యప్రదేశ్ కు చెందిన ఆల్ రౌండర్.