Begin typing your search above and press return to search.
'ఆసియా 30 అండర్ 30-2018`లో అనుష్క శర్మ!
By: Tupaki Desk | 27 March 2018 12:07 PM GMTస్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి - తెలుగుతేజం పీవీ సింధుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ విడుదల చేసిన 'ఆసియా 30 అండర్ 30-2018` జాబితాలో సింధు చోటు దక్కించుకుంది. సింధుతో పాటు మహిళా క్రికెటర్ స్మృతీ మంథన కూడా ఆ జాబితాలో స్థానం సంపాదించింది. బాలీవుడ్ నటి అనుష్క శర్మకూడా ఆ జాబితాలో ఉంది. మొత్తం 13 విభాగాల్లో తమదైన ముద్ర వేసిన వ్యక్తులను ఆ జాబితా కోసం ఎంపిక చేశారు. ఆసియాలోని దాదాపు 300 మందికి పైగా వ్యాపారవేత్తలు (ఎంటర్ ప్రెన్యూర్స్) - ఇన్నోవేటర్లు - క్రీడాకారులు - సినీ నటుల నుంచి 30 మందిని ఫోర్బ్స్ ఎంపిక చేసింది. ఆయా విభాగాల్లో ఆ వ్యక్తులు సాధించిన విజయాలు - ఘనతలు - వారి సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ జాబితాలో చోటు కల్పించారు.
30 ఏళ్ల లోపున్న 30 మందికి ఆ జాబితాలో చోటు దక్కింది. ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అనుష్క శర్మ (సినిమా రంగం) - పీవీ సింధు (అథ్లెట్ - బ్యాడ్మింటన్) - స్మృతీ మంథన(అథ్లెట్ - క్రికెట్) - మోడల్ భూమికా అరోరా - సైనప్ సీఈఓ అశ్విన్ రమేష్ - హేడేకేర్ ఫౌండర్ దీపాంజలి దాల్మియా - హెల్త్ సెట్ గో ఫౌండర్ ప్రియా ప్రకాష్ - స్టాన్ ప్లస్ టెక్ సహ వ్యవస్థాపకుడు ప్రభ్ దీప్ సింగ్ - జస్ట్ డాగ్ సహ వ్యవస్థాపకులు జుగల్ అంచాలియా - అభిషేక్ కుమార్ - షేర్ చాట్ సహ వ్యవస్థాపకులు ఫరీద్ అహ్ సాన్ - భాను ప్రతాప్ సింగ్ - అంకుష్ సచ్ దేవాలతో పాటు మరి కొందరు యువ వ్యాపారవేత్తలు - క్రీడాకారులు - నటీమణులు - మోడల్స్ ఆ జాబితాలో ఉన్నారు.