Begin typing your search above and press return to search.
సీఎం ఎవరైనా... మాకు లొంగాల్సిందే!
By: Tupaki Desk | 24 Nov 2018 4:26 PM GMTవివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు అయిన ఎంఐఎం నేత - ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరోమారు అదే రీతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ముఖ్యమంత్రి పదవిపై కూర్చునే నేతలపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న అక్బరుద్దీన్ ఈ సందర్భంగా పరుషమైన పదాలతో ఎద్దేవా చేశారు. మజ్లిస్ తలుచుకుంటేనే ముఖ్యమంత్రి ఎవరైనా తమ వద్దకు రావాల్సిందేనన్నారు. ఏ ముఖ్యమంత్రి అయిన తమ ముందు తలవంచాల్సిందేనని వెల్లడించారు.
``చంద్రబాబునాయుడు - వైఎస్ రాజశేఖర్ రెడ్డి - కిరణ్ కుమార్ రెడ్డి - కేసీఆర్..ముఖ్యమంత్రి ఎవరు అయినా నా ముందు తలవంచాల్సిందే అని అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ``సీఎం ఎవరైనా మా మాట వినాల్సిందే. నేను నాయకుడు కాదు. రాజకీయ రాజుని. నేను తలుచుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రి పదవి పైన కూర్చో పెడతాను లేదంటే వంగో పెడతాను. 11వ తేదీ తర్వాత మజ్లిస్ పార్టీ పవర్ ఏంటో ప్రపంచానికి చూపిస్తాం. హైకోర్టులో కేసు తొందరగా పూర్తి అయితే తెలుస్తుంది వీళ్ల సంగతి ఏంటో. కానీ రాజ్యాంగ లొసుగులతో వీళ్ల ఆట సాగుతుంది``అంటూ వ్యాఖ్యానించారు. గతంలో హిందువుల పై అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ సమావేశంలో 15 నిముషాల్లో లోపు హిందువులను చంపుతామంటూ చేసిన మత చాందస మాటలన ఓవైసీ మార్కు వివాదాస్పద వ్యాఖ్యలకు నిదర్శనమని అంటున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై చేసిన వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికైనా రాజ్యాంగ నిపుణులు ఓవైసీపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత రద్దు చేసేందుకు తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.