Begin typing your search above and press return to search.

కశ్మీర్ లో ఇప్పుడు ఎవరైనా భూమిని కొనొచ్చు .. కేంద్రం కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   27 Oct 2020 10:30 PM IST
కశ్మీర్ లో ఇప్పుడు ఎవరైనా భూమిని కొనొచ్చు .. కేంద్రం కీలక నిర్ణయం !
X
జమ్మూ కశ్మీర్, లఢక్‌ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏ పౌరుడైనా కూడా ఆ ప్రాంతాల్లో ఇకపై భూమిని కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసే విధానంపై మోదీ సర్కార్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమయం నుండి జమ్మూ కశ్మీర్ లో భారత దేశానికి చెందిన ఏ పౌరుడైనా కూడా అక్కడ భూములను కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అములోకి వస్తాయని వెల్లడించింది.

అలాగే , అక్కడ నివాసం ఉండే అవకాశాన్ని సైతం అందరికీ ప్రభుత్వం కల్పించింది. కాగా వ్యవసాయ భూములను ఇందులో నుంచి మినహాయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అక్కడ భూమిని కొనుగోలు చేసే అవకాశం లేదు. కానీ, ఆర్టికల్ 370 రద్దు తో ఆ నిర్ణయానికి కాలం తీరిపోయింది. ఆ విషయాన్ని నేడు కేంద్రం స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జమ్మూకశ్మీర్ పునర్వ్యవ్యస్థీకరణ చట్టం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందని వారు కూడా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది తమ ఆకాంక్ష అని ప్రభుత్వం స్పష్టం చేసింది. పారిశ్రామిక భూముల్లో పెట్టుబడులు అవసరమని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఆగష్టు 5, 2019 న జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, మరియు లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది.