Begin typing your search above and press return to search.

ఇంట్లో ఆడోళ్లు ఉండేటోళ్లు ఎవరైనా నిర్భయ దోషులకు ఉరి వద్దంటారా?

By:  Tupaki Desk   |   17 Dec 2019 5:39 AM GMT
ఇంట్లో ఆడోళ్లు ఉండేటోళ్లు ఎవరైనా నిర్భయ దోషులకు ఉరి వద్దంటారా?
X
మరే దేశంలోనూ కనిపించని మానవత్వం కొందరిలో కనిపిస్తుంది. అది కూడా దుర్మార్గులు.. పిశాచుల విషయంలో వారు ప్రదర్శించే మానవతావాదాన్ని చూస్తే.. అసలు వారు మనుషులేనా? అన్న సందేహం కలుగక మానదు. మానవత్వం ముసుగులో కరుణతో కూడిన మాటలు మాట్లాడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చేసింది. ఒక ఆడపిల్లను అత్యంత దారుణంగా.. హేయంగా అత్యాచారం చేసిన వారికి విధించిన ఉరిశిక్షకు వ్యతిరేకంగా వాదనలు వినిపించే వారి మాటలు విన్నంతనే పట్టలేనంత కోపం రావటం ఖాయం.

దోషుల మానవహక్కుల గురించి మాట్లాడే ఇలాంటివారు.. బాధితులకు మానవహక్కులు ఉండవా? అన్న సూటిప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతులేని దయ తమ సొంతమన్నట్లుగా లెక్చర్లు దంచేవారు.. తమ ఇంట్లో ఆడోళ్లు ఉన్నారా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటంతో పాటు.. వారు సైతం తమ వాదనలకు అండగా నిలుస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని స్పష్టం చేసిన తర్వాత ప్రజలకు తీరిగ్గా హక్కుల సుభాషితాలు బోధించే పని చేపట్టాలని చెప్పాలి.

నిర్భయ దోషులకు ఉరి వద్దనే వారి చేత.. ఒకటికి పదిసార్లు వారు చేసిన దారుణ ఉదంతాన్ని కళ్లకు కట్టేలా ఉండే ఛార్జిషీటును చదివించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా బాధితుల పక్షాన కాకుండా.. దోషుల పక్షాన నిలవటం.. అది కూడా క్రూరమైన నేరాలు చేసి.. అలాంటి వారిని తమతో పోల్చవద్దనే రీతిలో పశువులు సైతం ప్రాధేయపడే పరిస్థితి. అలాంటి నీచుల ప్రాణాల గురించి ప్రాకులాడే వారెప్పటికి మానవతావాదులు కాదు. ఆ మాటకు వస్తే.. ఈ దేశంలో ఏం చేసినా ఫర్లేదు.. ఎంత ఛండాలమైన పని చేసినా మద్దతుగా పోరాడేవారుంటారన్న నైతికస్థైర్యాన్ని కలిగించే హక్కుల కార్యకర్తలు సైతం దోషులే అవుతారన్నది మర్చిపోకూడదు. నేరం చేసిన వారితోపాటు.. నేరం జరిగేలా ప్రోత్సహించేవారు సైతం నేరస్తులే. హక్కుల కార్యకర్తలు ఇందుకు మినహాయింపు ఎందుకవుతారు?