Begin typing your search above and press return to search.
ఓరి నీ వేషాలో...ఎమ్మెల్యే అభ్యర్థులపై జనం టాక్ !
By: Tupaki Desk | 1 Nov 2018 7:03 AM GMTసహజంగా ఎన్నికలు వచ్చాయంటే చోటుచేసుకునే చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గెలిచిన తర్వాత అస్సలు గుర్తుకు రాని ఊళ్లన్నీ...హఠాత్తుగా నాయకుల మదిలో మెదులుతుంటాయి. తాము లైట్ తీసుకున్న సమస్యలన్నీ...అప్పుడే గుర్తుకువచ్చి...పరిష్కారం చేసేందుకు తహతహలాడుతుంటారు. అప్పటివరకు మనల్ని పట్టించుకోని వారు మనపట్ల ఎంతో ప్రేమ - ఆప్యాయతను ఒలకబోస్తుంటారు. అయితే, ఇవన్నీ ఒక ఎత్తు. తాజాగా చోటుచేసుకుంటున్న ఎన్నికల చిత్రాలు మరో ఎత్తు అని చర్చ జరగుతోంది. టీఆర్ ఎస్ పార్టీకి చెందిన నాయకులు ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న పనులు ఇలాంటి చర్చకు దారితీస్తున్నాయి.
ముందస్తు ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో అదికార టీఆర్ ఎస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని టీడీపీ - సీపీఐ - టీజేఎస్ కూటమి ఇంకా తన అభ్యర్థులను పెండింగ్ లోనే ఉంచింది. అయితే, 105 మంది అభ్యర్థులను గులాబీ దళపతి ప్రకటించగా వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రచారపర్వంలో భాగంగా టీఆర్ ఎస్ నేతల్లో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తున్న చిత్రంగా ఉండటంతో అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రద్దయిన అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి చిత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. తన నియోజకవర్గమైన భూపాలపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సెలూన్ లోకి వెళ్లిన మధుసూదనాచారి అక్కడ గడ్డం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తికి నున్నగా షేవ్ చేసేశారు. ఎంచక్కా మీడియా ముందే స్పీకర్ గారు ఈ పని కానిచ్చేశారు! అనంతరం, ఆ పక్కనే ఓ పూరిపాకలో ఉన్న వృద్ధుడు తన మధ్యాహ్నభోజనం తింటుండగా వెళ్లి ఆయనకు భోజనం తినిపించారు!!అంతకు రెండ్రోజుల ముందు మాజీ స్పీకర్ పల్లీలు అమ్మారు!!
ఇక, మహాబూబ్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ అయితే అన్ని పాత్రలు ఎంచక్కా పోషించేస్తున్నారు. నిర్మాణరంగంలో కూలీగా - బట్టలు ఇస్త్రీ చేసే వ్యక్తిగా - నల్లా నీళ్లు పట్టుకునే మహిళలకు సహాయం చేస్తూ...ఇలా సర్వం నిమగ్నమైపోయారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి తన ప్రచారంలో భాగంగా ఓ చిన్నారికి స్నానం చేయించారు. ఇలా ఓట్ల వేటలో నేతల చిత్రాలెన్నో. మహాకూటమి జాబితా విడుదలైతే...ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుంది. అయితే, ఇవన్నీ డిసెంబర్ 5వ తేదీ వరకే సామాన్యుడు ఈ మాన్యుల నుంచి పొందవచ్చు. ఎందుకంటే ఆరోజుతోనే ప్రచారం ముగిసిపోతుంది కాబట్టి!!