Begin typing your search above and press return to search.

బీజేపీతో ఎందాకైనా...ఆయన అరెస్ట్ తప్పదా...?

By:  Tupaki Desk   |   19 Nov 2022 2:30 PM GMT
బీజేపీతో ఎందాకైనా...ఆయన అరెస్ట్ తప్పదా...?
X
టీయారెస్ మొత్తానికి మొత్తం సిద్ధమని చెబుతోంది. రాజకీయ యుద్ధం కోసం ఎంతదూరమైనా అంటోంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అడ్డంగా దొరికిన రామచంద్రభారతి, సింహ యాజీలతో పాటు వారి వీడియోల ఆధారంగా కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తూ ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సిట్ కూడా దూకుడుగా ముందుకు సాగుతోంది.

ఈ నేపధ్యంలో బీజేపీకి జాతీయ స్థాయిలో కీలకమైన నేతగా పేరున్న బీ ఎల్ సంతోష్ కి నోటీసులు జారీ చేయడం ఈ నెల 21న తమ ముందుకు హాజరు కమ్మని చెప్పడం ద్వారా సిట్ తన వైఖరి ఏంటి చెప్పింది. ఒక వేళ సిట్ ముందుకు వచ్చి హాజరు కాకపోతే అరెస్ట్ దాకా కూడా వెళ్తారని అంటున్నారు. బీజేపీకి చెందిన ఒక ముఖ్యుడిని ఇలా అరెస్ట్ దాకా తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కానే కాదు.

ఈ విషయంలో తేడా వస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ విషయం తెలంగాణాలో అధికారంలో ఉన్న టీయారెస్ కి తెలియనిది కాదు, కానీ టీయారెస్ దూకుడు చేస్తోంది అంటే బీజేపీతో సై అంటే సై అని సవాల్ చేయడానికే అంటున్నారు. తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ సన్నిహితుడు శ్రీనివాస్ కి కూడా సిట్ నోటీసులు జారీ చేయడం కూడా కలకలం రేపుతోంది.

మరో వైపు చూస్తే టీయారెస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెర వెనక ఎంత మంది ఉన్నారో అందరినీ తెర ముందుకు తెచ్చి సిట్ విచారిస్తుంది అంటున్నారు. ఇక ఈ బీ ఎల్ సంతోష్ ఎవరు అంటే ఆయన జాతీయ స్థాయిలో బీజేపీలో కీలకంగా ఉన్న నాయకుడు అని అంటున్నారు. ఆయన ఎక్కువగా బయట కనిపించారు. కానీ బీజేపీలో అతి ముఖ్యుడనే అంటున్నారు.

అలనటి నాయకుడుకి నోటీసులు జారీ చేయడం అంటే ఆషామాషీ కానే కాదని అంటున్నారు. బీ ఎల్ సంతోష్ ని విచారణకు పిలిపించి ఇంకా పెద్ద తలకాయలు ఎవరెవరు ఈ ఆపరేషన్ ఫాం హౌస్ వెనకాల ఉన్నారు అన్నది కూపీ లాగాలన్నదే ప్రధాన ఉద్దేశ్యమని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి కాల్ డేటా ఆధారంగా చాలా పెద్దల పేర్లనే సిట్ తన ముందు ఉంచుకుందని అంటున్నారు.

వారిని వీలుని బట్టి పిలవడం ద్వారా విచారణను వేగవంతం చేయడానికి చూస్తోంది అని చెబుతున్నారు. ఇక్కడ ఒక్కటే విషయం. తెలంగాణాలో ఎన్నికలు వస్తున్నాయి. అవి పట్టుమని పది నెలలు కూడా లేవు. దాంతో ఆ ఎన్నికల్లో బీజేపీ ఎలాగైనా గెలవాలని చూస్తోంది. తొడగొట్టి సవాల్ చేస్తోంది. అందువల్ల బీజేపీని బదనాం చేయడానికి అందివచ్చిన అవకాశంగా ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారాన్ని వాడుకోవాలని టీయారెస్ చూస్తోంది అంటున్నారు.

అదే విధంగా తమ ఎమ్మెల్యేలనే కొనుగోలు చేయడానికి చూస్తున్నారు అంటే విషయం చాలా సీరియస్ అని దీని మూలాలలోకి వెళ్ళి అసలు సూత్రధారులను బయటపెట్టాలన్న పట్టుదల కూడా టీయారెస్ పెద్దలలో కనిపిస్తోంది అంటున్నారు. మొత్తానికి బీజేపీతో అమీ తుమీకి రెడీ అని గులాబీ పార్టీ చెబుతోంది. మరి దీని పర్యవశానాలు ఎలా ఉంటాయో ఏ రకమైన రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తాయో ఆలోచించాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.