Begin typing your search above and press return to search.
వైఎస్ జయంతి రైతు దినోత్సవం..జగన్ అక్కడ!
By: Tupaki Desk | 5 July 2019 1:58 PM GMTఈ నెల ఎనిమిదో తేదీని రైతు దినోత్సవంగా జరపనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. రాష్ట్రమంతా రైతు దినోత్సవం నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు దినోత్సవంలో పాల్గొంటారని కన్నబాబు ప్రకటించారు. కడప జిల్లా జమ్మలమడుగులో జగన్ రైతు దినోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
ఇక రైతు దినోత్సవం రోజునే పులివెందుల్లో అరటి పరిశోధన సంస్థకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టుగా మంత్రి ప్రకటించారు.
ఇక విత్తనాల కొరత అంశం మీద కూడా మంత్రి మాట్లాడారు. విత్తనాల సరఫరాలో ఇబ్బందులు తలెత్తినా సరిదిద్దినట్టుగా ప్రకటించారు. వేరుశనగ విత్తనాలను సక్రమంగా సరఫరా చేసినట్టుగా - ఉత్తరాంధ్రలోనూ సరిపడ విత్తనాలను సరఫరా చేసినట్టుగా మంత్రి తెలిపారు.