Begin typing your search above and press return to search.

అమరావతికి అండగా 'మూడు'

By:  Tupaki Desk   |   4 March 2022 5:30 AM GMT
అమరావతికి అండగా మూడు
X
యాదృశ్చికం కాకుంటే మరేంటి? అన్న భావన ఈ విషయాన్ని చూసినప్పుడు అనిపించక మానదు. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ‘‘మూడు’’ కీలకభూమిక పోషిస్తుందని చెప్పాలి. నిశితంగా పరిశీలిస్తే.. అమరావతిలోని ప్రతి అంకంలోనూ ‘మూడు’ చుట్టూనే తిరుగుతుండటం విశేషం. తాజాగా సంచలన తీర్పును వెలువడిన వేళలోనూ.. ఈ మూడు చుట్టూ పలు అంశాలు ఉండటం కనిపిస్తుంది.

సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ‘మూడో’ నెల.. ‘మూడో’ తేదీ.. ‘ముగ్గురు’ న్యాయమూర్తులు.. ‘ముగ్గురు’ ప్రధాన న్యాయమూర్తుల హయాంలో విచారణలు.. చివరకు ‘మూడు’ రాజధానులపై తీర్పు. ఇదే దేవుడి అసలైన స్క్రిప్టు.. అంటూ పోస్టులు వైరల్ అయ్యాయి.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జేకే మహేశ్వరి ఉన్న సమయంలో మూడు రాజధానులపై పలువురు పిటిషన్లు దాఖలు చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన హయాంలోనూ.. ఆ తర్వాత బదిలీ తర్వాత సీజేగా వచ్చిన జస్టిస్ ఏకే గోస్వామి హయాంలోనూ విచారణ జరిగింది. ఆయన బదిలీ మీద వెళ్లిన తర్వాత ప్రస్తుత సీజే జస్టిస్ పీకే మిశ్రా బాధ్యతలు చేపట్టారు. పెద్ద ఎత్తున వాదనలు జరిగిన అనంతరం గురువారం (మార్చి 3) ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా త్రిధర్మాసనం తీర్పును వెలువరించింది. అమరావతికి సంబంధించి కీలక ఘట్టం ప్రతిదీ ‘మూడు’తో ముడిపడి ఉండటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.