Begin typing your search above and press return to search.

అమ్మఒడి ప్రారంభం ... ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి : సీఎం జగన్

By:  Tupaki Desk   |   9 Jan 2020 10:15 AM GMT
అమ్మఒడి ప్రారంభం ... ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి : సీఎం జగన్
X
ఆంధప్రదేశ్ సీఎం శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ..ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నిరవేర్చుతూ ఏపీ అభివృద్దే ద్యేయంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికి ముందుకి అడుగులువేస్తున్నారు. ఇందులో భాగంగానే సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న అమ్మఒడి పథకాన్ని గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రారంభించారు. చదువు అనేది పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అని , పేదింటి తల్లులకు తమ బిడ్దలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని సీఎం జగన్ చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పిల్లలను బడికి పంపుతున్న ప్రతీ పేదింటి తల్లికి ఏటా 15 వేల రూపాయలు అందజేస్తామని తెలిపారు. చదువుకోవాలంటే ముందు కడుపు నిండాలని.. తల్లులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ ఏడాది విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నామని.. అయితే వచ్చే సంవత్సరం నుంచి తప్పని సరిగా 75 శాతం అటెండన్స్‌ ఉంటేనే పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. పధకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు దాదాపు రూ 6,318 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. దీంతో సుమారుగా 82 లక్షల మంది పిల్లలకు లబ్ది కలుగుతుందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో లో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు మాత్రమే ఈ పధకం అమలు చేస్తామని చెప్పినా..ఇప్పుడు ఇంటర్ వరకు అమలు చేస్తునట్టు సీఎం తెలిపారు.


ఇక పోతే , ఎవరికైనా అర్హత ఉండి కూడా అమ్మఒడి పథకం కింద వచ్చే 15 వేలు అందనటువంటి తల్లులందరూ ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోవాలని సీఎం జగన్‌ విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం, ఆయాల జీతాల పెంపు, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మార్పుల గురించి సీఎం జగన్‌ ప్రజలకు వివరించారు. అలాగే మరోసారి ప్రభుత్వం బడుల్లో ఇంగ్లీష్ మీడియం పై స్పష్టత ఇచ్చారు. వచ్చే జూన్ నుండి ఒకటి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం అమలు చేయబోతున్నట్టు తెలిపారు. అయితే ఆంగ్ల మాధ్యమం పై ప్రజల ఆకాంక్ష చంద్రబాబుకు, సినిమా యాక్టర్‌ కు పట్టడం లేదని సీఎం జగన్‌ విమర్శించారు. తెలుగు మీడియం కావాలనే నేతలెవరూ తమ పిల్లలను ఆ మీడియం లో చదివించడం లేదన్నారు.


ఈ క్రమంలో తెలుగు మీడియం పిల్లలకి కొన్ని ఇబ్బందులు వస్తాయి గనుక.. వాటిని అధిగమించేలా బ్రిడ్జ్ కోర్సులు తీసుకుని వస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల కోసం శిక్షణా కోర్సులు ప్రవేశపెడతామన్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో కూడా తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఇంటర్ అయిపోయిన పిల్లలకి చదువుకోవడానికి ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు చేసి , ఖర్చులకోసం విద్యా దీవెన..విద్యా వసతి కింద ప్రతీ విద్యార్ధికి రూ 20 వేలు అందిస్తామని చెప్పారు. బడులను చదువు ల దేవాలయంగా మారుస్తామని ప్రకటించారు.