Begin typing your search above and press return to search.

AP: నిధులున్నాయా అస‌లు ?

By:  Tupaki Desk   |   6 April 2022 5:43 AM GMT
AP: నిధులున్నాయా అస‌లు ?
X
డ‌బ్బుల‌న్నీ ఏమ‌యిపోతున్నాయో తెలియ‌డం లేదు. పాపం ! మంత్రులు మాత్రం ఒట్టిపోతున్న ఖ‌జానాను చూసి ఏమీ మాట్లాడ‌లేక‌పోతున్నారు. తీవ్ర అసంతృప్తిలో వారు కూడా ఉన్నారు. ప‌ద‌వి క‌న్నా ప‌నులే ముఖ్యం అని ఎన్నిక‌ల ముందు అవే త‌మ‌కు శ్రీ రామ ర‌క్ష అని, అవే లేకుంటే జ‌నం మ‌ధ్యకు వెళ్ల‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు మంత్రులు కూడా ! కానీ నేను సంక్షేమాన్ని న‌మ్ముకున్నాను అదే శ్రీ రామ ర‌క్ష అని చెబుతున్నారు యువ ముఖ్య‌మంత్రి. త‌త్ భిన్న వాదన‌ల్లో గెలిచేది ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టికిప్పుడు తేలేది కాదు కానీ ముందు పంచాయ‌తీల‌కు నిర్వ‌హ‌ణ నిధులు ఇవ్వ‌మ‌నండి చాలు అని టీడీపీ విన్న‌విస్తోంది.

పాల‌న‌కు సంబంధించి జ‌గ‌న్ చెబుతున్న వాటిపై ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు రేగుతున్నాయే త‌ప్ప స‌రైన ప‌రిష్కారం అయితే ఎవ్వ‌రికీ ద‌క్క‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ప‌థ‌కాల ప్ర‌కట‌న‌కు మాత్రం సిద్ధం అవుతున్నారే త‌ప్ప ! అభివృద్ధి పై దృష్టే లేద‌ని తేలిపోయింద‌న్న విమ‌ర్శ‌లు విప‌క్షాలు నుంచి వినిపిస్తున్నా ప‌ట్టించుకున్న దాఖ‌లాలే లేవు. చంద్ర‌బాబు మ‌న‌కు న‌థింగ్ అని మాత్ర‌మే అంటున్నారు కానీ అంత తేలిగ్గా ఆయ‌న‌ను, ఆయ‌న చెబుతున్న మాట‌ల‌ను తీసిప‌డేస్తే విప‌క్షాల మాట‌ల‌కు కౌంట‌ర్ గా మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారని టీడీపీ ప్ర‌శ్నిస్తోంది.

ముఖ్యంగా పంచాయ‌తీల గొడ‌వ తీవ్ర స్థాయిలో న‌డుస్తోంది. విద్యుత్ ఛార్జీల బ‌కాయిల పేరిట ఇప్ప‌టికే ఓ సారి త‌మ‌కు చెప్ప‌కుండా డ‌బ్బులు గుంజుకున్నార‌ని సర్పంచులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో కేంద్రం రంగంలోకి దిగి నేరుగా పంచాయ‌తీల ఎకౌంట్ల‌కే డబ్బులు జ‌మ అయ్యే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టింది.

తాజాగా ఆస్తి ప‌న్ను తో స‌హా వివిధ ప‌న్నుల రూపంలో 1414 కోట్ల రూపాయ‌లు వ‌సూలు అయ్యాయ‌ని తెలుస్తోంది. ఈ మొత్తం ఏమ‌యింది అన్న‌ది కూడా తెలియ‌డం లేదు.ఇదే కాకుండా మైనింగ్ నుంచి 900 కోట్లు వ‌చ్చింది. ఈ మొత్తం ఏమ‌యిందో తెలియ‌దు.

వీటితో పాటు న‌గ‌రాల్లో వివిధ ప‌న్నులు యూజ‌ర్ ఛార్జీలు అంటూ లాక్కుంటున్నారు. విద్యుత్ ఛార్జీల పేరిట ఓ 1400 కోట్లు లాక్కోవాల‌ని చూస్తున్నారు. ఇంత‌టి భారం ఉన్నా కూడా బ‌య‌టకు అధికార పార్టీకి చెందిన వేరొక‌రెవ్వ‌రూ మాట్లాడ‌లేక‌పోతున్నారు.

ఇప్పుడున్న తాజా లెక్క‌ల ప్ర‌కారం ఏడున్న‌ర కోట్ల రూపాయ‌ల అప్పు అయితే షురూ అయింది. దీనిని ఇంకాస్త పెంచేందుకు ఆర్బీఐ తో మంత‌నాలు సాగిస్తున్నారు. ఇదే క‌నుక జ‌రిగితే ఆర్థిక సంక్షోభం రావ‌డం ఖాయం అని య‌న‌మ‌ల లాంటి లీడ‌ర్లు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. ఈ ద‌శ‌లో నిధులున్నాయా అస‌లు అన్న సంశ‌యాల‌కు సమాధానాలే దొర‌క‌డం లేదు.