Begin typing your search above and press return to search.
పీవీ సింధుకు సబ్ కలెక్టర్ ఉద్యోగం బిల్లు పాస్
By: Tupaki Desk | 16 May 2017 6:41 AM GMTఒలింపిక్స్ లో తన అద్భుత క్రీడా ప్రతిభతో భారత్ కు రజత పతకాన్ని సాధించిన పీవీ సింధుకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా చట్ట సవరణ బిల్లును ఈ రోజు ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఒలింపిక్స్ లో సింధు అద్భుతమైన ప్రతిభ చూపించని.. ఆమెను ఉప కలెక్టర్ గా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
సింధు అధ్బుత ప్రతిభ ప్రదర్శించిన నేపథ్యంలో ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆఫర్ చేశారు. తాను ఇచ్చిన వరాన్ని అమలు చేయటానికి వీలుగా తాజాగా అసెంబ్లీలో ప్రజా సేవల చట్టసవరణ బిల్లు రూపంలో ప్రవేశ పెట్టి.. ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.
గత ప్రభుత్వాలు క్రీడారంగాల్ని నిర్లక్ష్యం చేశాయని.. తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చంద్రబాబు బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. సింధుకు ఉద్యోగం ఇచ్చే విషయంలో ఎలాంటి తప్పు లేదు.. కానీ.. నిజంగానే ఆమె సబ్ కలెక్టర్ బాధ్యతల్ని నిర్వర్తిస్తారా? అన్నది ప్రశ్న. కెరీర్‌లో మాంచి ఊపు మీద ఉన్న వేళ.. తన దృష్టి మొత్తం ప్రాక్టీసు మీద.. టోర్నీల మీదే ఉంటుంది తప్పించి.. ఏపీ ముఖ్యమంత్రి ఇచ్చే గ్రూప్ 1 ఉద్యోగం మీద ఉండదన్నది నిజం ఈ విషయంలో మరో మాటే లేదు. అలాంటప్పుడు ఇంత హడావుడి ఎందుకన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు.
క్రీడల్ని ప్రమోట్ చేయటం అంటే.. సింధుకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వటం కాదని.. అంతకు మించి చేయాల్సినవి చాలానే ఉన్నాయని.. కానీ వాటిని పట్టించుకోకుండా ప్రచారం కోసమే సింధుకు ఇలా ఉద్యోగం ఇస్తున్నట్లుగా హడావుడి చేస్తున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. చేయని ఉద్యోగం కోసం చట్టసవరణ చేసి మరీ.. ఇంత ప్రయాస అవసరమా? అన్నది ప్రశ్న సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/