Begin typing your search above and press return to search.
7 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ
By: Tupaki Desk | 9 Dec 2019 6:36 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈసారి కేవలం 7 రోజుల పాటు మాత్రమే కొనసాగనున్నాయి. తాజాగా సోమవారం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన అసెంబ్లీ లో బీఏసీ సమావేశం జరిగింది. ఇందులో ఈనెల 9 నుంచి 17వరకూ ఏపీ అసెంబ్లీని ఏడు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు ఇచ్చారు.
బీఏసీ సమావేశానికి సీఎం జగన్ తోపాటు మంత్రులు బుగ్గన, కురసాల, అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, శాసనసభ ఉప ప్రతిపక్ష నేత అచ్చెం నాయుడు హాజరయ్యారు.
మొదట 9 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం 15రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కోరింది.
కానీ ప్రభుత్వం మాత్రం ఏడు రోజులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.