Begin typing your search above and press return to search.
టీడీపీ అరాచకాలకే హయ్యెస్ట్ టీఆర్పీ!
By: Tupaki Desk | 25 March 2017 10:03 AM GMTఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోందని ఎవరినైనా అడిగితే ఒక్క ముక్కలో సమాధానం చెబుతున్నారు.. ప్రతిపక్ష వైసీపీ సభ్యుల పీక నొక్కి టీడీపీ నేతలు అసెంబ్లీ అరాచకం సృష్టిస్తున్నారంటున్నారు. జనంలోకి బాగా వెళ్లిన ఈ నిజానికి నిలువెత్తు సాక్షం ఏపీ అసెంబ్లీ సమావేశాల లైవ్ టెలికాస్టుకు హయ్యెస్టు టీఆర్పీ రేటింగ్సు వస్తుండడమే. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలతో పోల్చితే ఏపీ సమావేశాలకు రేటింగు బాగా పెరిగిపోయింది. అక్కడ అధికార పక్షం ఏ రోజు ఏం చేస్తుందో.. ఏ నిమిషానికి ఎవరిని బహిష్కరిస్తుందో అన్నట్లుగా ఉండడంతో జనాలు ఈ సమావేశాలను టీవీల్లో వీక్షిస్తున్నారట.
ఏపీ అసెంబ్లీలో పాలక, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు.. సమర నినాదాలు.. సవాళ్లు ప్రతిసవాళ్లు చాలా కామన్ అయిపోయాయి. అంతేకాదు.. ప్రతిపక్ష నేత జగన్ ను సైతం గొంతెత్తనివ్వకుండా మైక్ కట్ చేస్తుండడం వంటివన్నీ ప్రజలు చూస్తున్నారు.
గత వారం రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారంపై చర్చలు.. అగ్రిగోల్డ్ కుంభకోణంలో చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరగడం.. రెండు పార్టీల నేతల వాగ్యుద్ధాలు అన్నీ ప్రజలను టీవీలకు అతుక్కునేలా చేశాయట.
అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ చాలా సాఫీగా సాగుతోంది. అడపాదడపా ఏవో వాదనలు ఉంటున్నా మ్యాగ్జిమమ్ కూల్ గా నడిచిపోతోంది. కాస్త నోరు విప్పే టీడీపీ ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం.. సస్పెండ్ కావడంతో అక్కడంతా టీఆరెస్ కూల్ గా వ్యవహారం నడిపించేస్తోంది. దీంతో రభస అంతా ఏపీ సభలోనే కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/